"నీ జ్జాపకం నాతోనే"1980,(ధారావాహిక 12,వ,బాగం)--నాగమణి రావులపాటి
 జీవన రాగంలో అనురాగాల హరివిల్లుపై 
మమతల మల్లెలు పూలమాలలై 
పరిమళించిన ప్రేమ కుసుమం రాగాలు పలకగా
రాహుల్ కుసుమల ప్రణయ కావ్యం
ఆకాశంలో విహంగమై విరిసి మురిసింది..!
ఒకరోజు రాహుల్ కుసుమను  సాయంత్రం
సినిమాకు వెళ్దాం రమ్మన్నాడు.! నీతో సినిమాకు
రాను బాబు, అసలే అమ్మ ఎక్కడ తిడుతుందో
 అని భయపడి చస్తున్నా.! ఇంకా సినిమాకి వెళితే
ఏమన్నా వుందా .!ఈకాస్త కూడా రానీయదు 
అని అన్నది కుసుమ.! ఏమో అదంతా నాకు 
తెలియదు నువ్వు వస్తున్నావు అంతే
మళ్ళీ నేను విజయవాడ వెళితే ఇప్పటిలో
కుదరదు .!అదీగాక ఇంతవరకూ మనం ఒక సినిమాకు కూడా వెళ్ళలేదు.! ప్లీజ్ కుసూమా రావే అ
అని బతిమాలాడు  ..!
మీతో వచ్చిన చిక్కే ఇది నన్ను ఇరకాటంలో
పడేస్తారు.! పెళ్ళయ్యాక రోజూ వెళదాము
ఇప్పటికి వదిలేయండి.! అని అన్నది కుసుమ
అలాకాదు నువ్వు రావాల్సిందే అంతే రేపు
మనం వెళుతున్నాం .! అని మొండికేసాడు
రాహుల్ ఇబ్బందిగా  ఫీల్ అయింది కుసుమ.!
ఇంటికి వెళుతూనే ,రేపు రాహుల్ తో ఎలా సినిమాకు 
వెళ్ళాలి అమ్మకు ఏమని చెప్పాలి అని మదిలో
ఆలోచనలు చేస్తూ ఒక నిర్ణయానికి వచ్చింది..!
గీత దగ్గరికి వెళ్ళి విషయం వివరించింది నాకోసం ఎలాగైనా రావే నీవే మాఇంటికి వచ్చి నన్ను
సినిమాకు రమ్మని అమ్మకు తెలిసేలా అడుగు
నాకు సీనిమాల పిచ్చి వుందని అమ్మకు తెలుసు
కదా .!అని గీతను బతిమాలింది రాహుల్ కుసుమ
లతో వెళ్ళటం గీతకు ఇష్టం లేకపోయినా కుసుమ
ఇంటి పరిస్తితి తెలిసి సరే అని అన్నది గీత.!
ఆ ఆనందంతో గీత బుగ్గపై ముద్దు పెట్టుకుంది
కుసుమ..! గీత ,తల్లీ నేను రాహుల్ ను కాదు
గీతను అన్నది కొంటేగా.! తెలుసు లేవే  రాహుల్
ని ఎలాగూ పెట్టుకోలేను ,నీకు పెట్టాను అని అన్నది
కుసుమ .!అబ్బో మాటలు బాగా నేర్చావు
నాకు తెలియదను కున్నావా అని అనగానే
కుసుమ సరేలే రేపు అమ్మ ముందు అడుగు
అని చెప్పి ఇంటికి వెళ్ళింది కుసుమ.!
ఇంతలో? (సశేషం)తరువాత బాగం రేపే.!!
వర్క్ టెన్షన్ వల్ల కాస్తే రాయగలిగాను 
"మన్నించండి"మీ అభిప్రాయం కామెంట్ చేయండి.!!

కామెంట్‌లు