ఉగాది వచ్చింది;---కయ్యూరు బాలసుబ్రమణ్యం 7780277240
ఉగాది పండుగ వచ్చింది
షడ్రుచుల పచ్చడి తెచ్చింది
మామిడి తోరణాలు కట్టాము
క్రొత్త బట్టలను తొడిగాము

తాతయ్య వచ్చాడు
తేనె తీసుకొచ్చాడు
చిన్నాన్న వచ్చాడు
నారింజ తెచ్చాడు

పిన్నమ్మ వచ్చింది
వేప పూత తెచ్చింది
మేనత్త వచ్చింది
మిరియాలు తెచ్చింది

మామయ్య వచ్చాడు
మినప పప్పు తెచ్చాడు
అన్నయ్య వచ్చాడు
ఉప్పు తీసుకొచ్చాడు

అమ్మ,నాన్న వచ్చారు
అన్నిటిని కలిపారు
షడ్రుచుల పచ్చడిని
అందరము తిన్నాము


కామెంట్‌లు