ఉగాది (సీస పద్యము);-మమత ఐలహైదరాబాద్9247593432
 ఆరోగ్య విలువకు యతిప్రదా నముగాను
       షడ్రుచు లయుగాది చక్క దనము
సమ్మేల నాలతో సందడి జేయుచు
       సంతోష మొనగూర్చె చక్కగాను
పచ్చడి బొబ్బట్ల పర్వాల వంటలు
     పంచాంగ శ్రవణము బాగు బాగు
గౌరిదే వికిపూజ ఘణముగా జరిపేరు
     పెద్దచి న్నయనక  శ్రద్ధ బెట్టి
ఆ.వె
వత్స రమ్ము లోన వంటప్ర త్యేకత
వేప పూవు మావి వెగటు దినుట
యుగము ఆది గాను ఆయుగా దికిపేరు
మనసు పెట్టి వినుము మమత మాట
అంశం:-ఉగాది
:కం
కొత్తచిగురుటాకులతో
గుత్తుల మావిళ్ళపూత కోయిల పాటల్
కొత్తాలోచనజేయుచు
నత్తనడకవీడమనుచు నచ్చెనుగాదీ!

కామెంట్‌లు