సమస్యా పూరణలు;-మమత ఐలకరీంనగర్9247593432
 *ధర్మాత్ముని ధరణి మోసి ధన్యత జెందున్*
క.
నిర్మల హృదయులు కుడుదురు
చర్మముతో చెప్పుల జత సర్వజగతికై
మర్మపు సేవల నెరిగిన
*ధర్మాత్ముని ధరణి మోసి ధన్యత జెందెన్*
 సమస్యాపూరణం
*ధర్మాత్ముని ధరణి మోసి ధన్యత జెందెన్*
క.
నిర్మాతగ భూ విభుడై
దుర్మార్గపు రక్కసున్ని తుంచి జగతిన్
నిర్మాణము సృష్టించిన
*ధర్మాత్ముని ధరణి మోసి ధన్యత జెందెన్*

కామెంట్‌లు