సమస్యాపూరణలు;-మమత ఐలకరీంనగర్9247593432
 *కన్యను ముగ్గురాదరముగన్ గనిరిమ్ముగ కీర్తికాములై*
ఉ.
కన్యను చూడబోయిరిక కారణ మేమన పెళ్లి చూపులే
మాన్యుడు తండ్రిగా మరియు మాతతొ పుత్రుని వెంటబెట్టుకన్
ధన్యత తెల్పిచూపిరిక తారను రమ్మని సంతసంబుతో
*కన్యను ముగ్గురాదరముగన్ గనిరిమ్ముగ కీర్తికాములై*
 సమస్యాపూరణం
*కారము మేలుగాదె మన కాంతల మేనికి సొంపునింపగన్*

దారము తోడ పూవులను దండగ కూర్చట యెంత సత్యమో!
నారికి బొట్టు కాటుకలు నవ్యత గూర్చుధరించ సొమ్ములన్
చారెడు కన్నులుండి మరిచక్కని సద్గుణ తీరుతెన్నెలా
*కారము మేలుగాదె మన కాంతల మేనికి సొంపునింపగన్*

కామెంట్‌లు