ఉగాది ఆశలు-- బెహరా ఉమామహేశ్వరరావు 9290061336
శుభం పలుకుతూ వచ్చే
శుభకృత్! ఉగాది వసంతం!
స్వాగతం!సుస్వాగతం!
పాడండి వసంతగీతం
కోకిలమ్మల గానం వినబడదు
తోటలు మాయం చేసిన మనం
నిలువ నీడలేని పక్షి గణం
తాగేందుకు లేదు జలం! దాహం దీర్చ,
ఎక్కడ కానరాదు పశు సంపద, జాడ!
రాక్షసత్వానికి అదే ఇక ప్రతీక
కాల ధర్మాలు మారక తప్పదు
     బాలలూ ఇక మీరైనా పాడండి
      గతమంతా యించుక తెలుపవలె
      పెద్దలకు సుద్దులు నేర్పితే; బాగు!
     చూడండి  నేటి  విశ్వగతి
     గతి తప్పిన మానవతావాదం
ఈనాటి రష్యా రణతంత్రం
యుద్ధోన్మోదమే మంత్రం
పసిపిల్లలపై బాలింతలపై
వృద్ధులపై బాంబుల వర్షం
ఉక్కిరి బిక్కిరైన ఉక్రెయిన్ దేశం
దశా, దిశా, మారింది అదో వినాశం
కనుల విందు చేసే మహానగరాలు
స్మశానంలా హృదయ విదార దృశ్యం
భారతావని చూడండి
శాంతి తంత్రం తెలుసుకోండి
ప్రశాంతత తెలియని నాయకులు
అశాంతితో అలమటించే మనుషులు
ఏమి చెబుతూ బోధ పరచగలం
శాంతి బోధనలు తప్ప!!!
   

కామెంట్‌లు