ధైర్యం ఉన్న పిల్లలం(బాల గేయం);-గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.--సెల్ నెంబర్.9491387977.
ధైర్యం ఉన్న పిల్లలం
అధైర్యం లేని మల్లెలం
సహనాయకులే అనిరి
సాహసమే మా ఊపిరి !

మేం భయాన్ని జయిస్తాం 
మా అభయాన్ని కలిగిస్తాం
ధైర్య శక్తిని పుంజుకుంటం
ధైర్యే సాహసం లక్ష్మి అంటం!

ఆత్మస్థైర్యంతోనే ఉంటాం నిత్యం
ఆత్మారామున్ని కంటాం సత్యం
మా ధైర్యాన్ని అందిపుచ్చుకుంటం
మేము అనుకున్నది  సాధిస్తుంటం!

కష్టాలెన్నేదురైనా  ఎదుర్కొంటాం
ఇష్టంగా మేమంతా కుదుర్కుంటాం
నష్టం కలగకుండా  సదుర్కుంటాం
స్పష్టం చేస్తూ మేం  పదుర్కుంటాం!

మా ధైర్యవచనాలను అందిస్తాం
మేం హితోపదేశాలను సంధిస్తాం
మనసుకు ఊరటను కలిగిస్తాం
మదిలోని ధైర్యాన్ని వెలిగిస్తాం !

నిర్భయమైన మనసుతో ఉంటాం
మహిలో తలెత్తుక తిరుగుతుంటాం
స్వేచ్ఛా విహారంకైమేం తపిస్తుంటాం
ధైర్యేసాహసే లక్ష్మీఅని జపిస్తుంటాం

ముళ్ళకు వెరువని గులాబీలా ఉంటాం
స్వేచ్చా సౌందర్య పిపాసను కంటాం
ధైర్యమే మా  ఆయుధమని మేం అంటాం
విజయమే వీర స్వర్గమని మేం జీవిస్తుంటాం !కామెంట్‌లు