👌సకల జనులందరికి
వశ్య మంత్రమె విద్య!
బ్రహ్మాస్త్రమే విద్య!
ఓ తెలుగు బాల!
( తెలుగు బాల పదాలు., శంకర ప్రియ.)
👌"విద్య" అనగా జ్ఞానము, మరియు విజ్ఞానము! అనగా
ఆధ్యాత్మిక జ్ఞానము, మరియు, భౌతిక విజ్ఞానములు రెండూ నేటితరం తప్పకుండా తెలుసుకోవాలి!
👌విద్య.. సన్మానములు, రాచ మర్యాదలు పొందు బుద్ధిమంతులకు.. వశీకరణ మంత్రమైనది! వారికి మేలు చేకూర్చు చున్నదీ.. "విద్య"!
👌విద్య.. పట్టుదల )తో శత్రువులపై విజయము సాధించుటకు బ్రహ్మాస్త్ర మైనది! సంఘ సేవకులు, దేశ రక్షకులకు.. ఆత్మ స్థైర్యము, ధైర్యముల నొసంగు చున్నదీ "విద్య"!
⚜️ సీస పద్యము (పాదం) ⚜️
పలురాచ మన్ననల్ బడయు వారికి, విద్య
యే "వశ్య మంత్రమై" యింపొసంగు!
చలముతో వైరుల సాధించు వారికి,
విద్య "బ్రహ్మాస్త్రమై" విజయ మొసగు!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి