జటలందు నెలరాజు "శంకర ప్రియ.," శీల.,సంచార వాణి: 99127 67098
       జటలందు నెలరాజు
     మెడయందు ఫణిరాజు
      ధరించిన సాంబయ్య!
              శంకర ప్రియులార!
 (-- శంకర ప్రియ పదాలు.,)
👌చంద్రుడు.. నెలరాజు! వెన్నెలఱేడు! పరమేశ్వరుని కొరకు తపస్సు ఆచరించాడు. స్వామి దివ్యానుగ్రహముతో, జటాజూటమునందు శిరో భూషణ మైనాడు. అందువలన, సాంబశివుడు.. "చంద్ర శేఖరుడు" అయినాడు!
👌ఫణిరాజు.. బల్పాప ఱేడు! సాంబశివుని నియమ నిష్టలతో పూజించాడు. స్వామి దివ్యానుగ్రహముతో, కంఠమందు అలంకార మైనాడు. అందువలన, పరమేశ్వరుడు.. "నాగాభరణుడు" అయినాడు!
⚜️ సీస పద్యము ( చరణములు )
      తపమేమి సల్పెనో తారా పతీంద్రుండు; మూర్థంబు నందిన మోక్షమబ్బె!
      వ్రతమేమి చేసెనో ఫణిలోక నాథుoడు; కంఠాన నెలకొన్న ఘనత యబ్బె!
    
      ( ఓం నమః శివాయ., "శివలెంక" డా. మీగడ రామలింగ స్వామి)

కామెంట్‌లు