ఆటవెలది పద్యాలు;-శోభన్ బాబు9 వ తరగతి,ఈ/యం.జి.ప.ఉ.పా.కుకునూర్ పల్లి,కొండపాక మండలం, సిద్దిపేట జిల్లా.
 1.
మంచివారి తోడ మాటలాడిన చాలు 
మనిషి విలువ తెలిసి మసలుకొనుము
చదువు నేర్వ కున్న సంస్కార మబ్బాలి
బాబు మాట వినగ భవిత వెలుగు .
2.
ధనము పొదుపు చేసి తాను తినక యుండి
పరుల కివ్వ కున్న  పాడు యౌను
తెలివి లేని వారి తీరు యీలాగురా! 
బాబు మాట వినగ భవిత వెలుగు .



కామెంట్‌లు