ఆకు ఆకలి!?; -ప్రతాప్ కౌటిళ్యా
ఊహలో దాక్కున్న నిజం
గుహలో దాక్కున్నాఅడవీ
ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి !!?

సత్యం అంచుల్లో నుంచి
నీటి ముత్యం జారుతున్నట్లు
ఆల్చిప్పలో నీటి చుక్క
ఆణీ ముత్యం గా మారుతుంది

ఎదిరించిన అభినయం జీవించినట్లు
రంగస్థలంపై నాటకం కన్నా
నటుడే కనిపిస్తున్నాడు!!

కత్తిని ఉరి తీస్తున్నప్పుడు మెత్తని ఉరితాడుకు ఊపిరి ఆడటంలేదు!!?
గొంతు తడారిపోతుంది
ఎడారి ఓడ వేడెక్కిన ఎడారి కి దారి లేదు!!

మిణుగురుల వెలుగులో
చీకటి ఆటాడుకుంటుందీ
వేట కోసం వెళ్ళిన వేటగాడి
నోటమాట ఆగిపోయింది!!?

పర్వతాన్ని పడగొట్టిన నది
అడవిని ఎదిరించలేక పోయింది
ఆకలేసినా పులి కేకలకు కూడా
అడవి భయపడింది లేదు!!?

మలినం మానం మౌనంగా ఉందంటే
మరుభూమి యుద్ధం ముగిసింషది అని అర్థం
పచ్చని ఆకుకు ఆకలేసింది ఏమో
సూర్యుణ్ణి మింగేసింది
పడమరన సంధ్య ఆకుపచ్చగా మారింది

నా ఊరు నీరు నీ ఊరు నీరు
నీరు ఊరిన బావి
భవిష్యత్ తరాలకు నిధి
పాతాళం పాత తాళం చెవీ అది!!?

చీమలు మట్టితో పుట్టలు కట్టుకుంటున్నాయి
చీమలే పుట్టకుండా గట్టిగా మట్టి కలలు కంటుంది
లోయలో పడిపోయిన విత్తనం
ఎంతో ఎత్తుకు ఎదిగి లోయను అధిగమించింది!!?

సైన్యాన్ని తయారు చేస్తానని చెట్లను నాటి
పక్షుల్ని సృష్టించిన పల్లె
మళ్లీ ఆకాశాన్ని జయించింది!!?

భూమిని ప్రేమించిన చెట్టు
పట్టుదలతో ఒక వంతు భూమి ని కాపాడింది. ఎంత మంచిది!
భూమిని ప్రేమించిన నీరు
భూమిని మూడు వంతులు ముంచింది
ఎంత చెడ్డది!!

రాలుతున్న నక్షత్రాలను ఏరుతూ
ఎంతకాలం భూమిలా బతుకుతావు
పాలపుంతలో మారిపోతే ఎంత బాగుంటుందో!!?

సూర్యుడు ఎప్పుడూ ఎరుపే
ఆకాశం సముద్రం మాత్రం నీలమే
అది గొప్ప మార్పు కాదన్నా
భూమి ఆకుపచ్చదైందీ!!!?

నేడు శ్రీ శ్రీ జయంతి
Pratapkoutilya lecturer in Bio-Chem palem nagarkurnool dist 🙏❤️🙏
SRI SRI KALAVEDIKA President dist
8309529273

కామెంట్‌లు