టెన్త్ పరీక్షలు దగ్గరపడుతున్నాయి.ఎండచిటపటలు కోవిడ్ భయం పరీక్షలటెన్షన్ తో ఉన్న పిల్లలకి టీచర్ ఇలా చెప్పారు " ముందు బాగా వచ్చినవి ఒకసారి చదివి రోజు తెల్లారుఝామున రాని కష్టమైన సబ్జెక్ట్ చదవాలి. అప్పుడే మీలో ఆత్మ విశ్వాసం గుండె ధైర్యం పెరుగుతాయి.అనుమానం సందేహం ఉన్నవాటిని వెంటనే తీర్చేసుకోవాలి.ధీమాగా ముందు బాగా వచ్చిన ప్రశ్న జవాబులు రాస్తే ఒకటి అరా తోచింది రాయండి. "అని ఆమె ఒక కథ చెప్పసాగింది.పిల్లలు శ్రద్ధగా వినసాగారు.ఒక సన్యాసి తన కుటీరం లో కూచుని ఎప్పుడూ దైవధ్యానం లో ఉండేవాడు.భిక్షాటన చేసి కొంత ధాన్యం వండుకుని మిగిలింది బీద దివ్యాంగులకి పంచేవాడు.కానీ కొన్ని రోజులకి తనపాత్ర లోని బియ్యం మాయంకావటంతో అతనికి ఏంచేయాలో తోచలేదు.అతనికుటీరంలో ఓమూల ఎలుకలజంట రోజు పాత్రలోని ధాన్యంని తీసుకుని వెళ్లి తమ కలుగులో దాస్తున్నాయి.సాధువు దాచినదంతా అవి దోచుకుంటూ "మనకలుగు ధాన్యపు రాశితో కళకళలాడుతూ ఉంది. "అనే ధైర్యం ఆత్మ విశ్వాసం పెంపొందించుకున్నాయి.సాధువు పాత్రను ఎత్తయిన ప్రదేశంలో పెట్టినా అవి తస్కరిస్తున్నాయి.ఒక రోజు ఒక సన్యాసి ఇలా సలహా ఇచ్చాడు "నీకుటీరంలో ఎలుకలు ఉండిఉంటాయి.ముందు ఆకలుగు ఎక్కడ ఉందో వెతుకు." సాధువు ఎలుకలున్న కన్నం వెతికి మొత్తం తవ్వి ఆధాన్యపు రాశిని పాత్రలోకి ఎత్తాడు.ఆరోజు సాధువు బైట కెళ్ళిన సమయంలో ఎలుకల జంట తమకలుగు ఛిన్నాభిన్నం అవటమే కాకుండా తాము సేకరించిన ధాన్యపురాశి మాయంకావటంతో దిగాలు పడినాయి.వాటిలో పరుగెట్టే శక్తి ఉత్సాహం పూర్తిగా పోయింది. ఇన్నా ళ్ళు తాము సేకరించిన ధాన్యపురాశి వాటికి ఆత్మవిశ్వాసం కొండంత బలం ఇచ్చింది.కొద్ది దూరం లో తమకు అందుబాటులో ఉన్న ధాన్యంనిండిన పాత్రను సమీపించాలన్నా ఏదో తెలీని బెరుకు భయం నిస్సత్తువ ఆవహించి ఆప్రాంతంని విడిచి పెట్టి పారిపోయాయి.మనం అనుకూలంగా లేని ప్రాంతంలో కొన్నాళ్ళు భయపడుతూ ఉంటాం.కానీ ధైర్యంగా పరిస్థితులు ఎదుర్కోవాలి.ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలి. పరీక్షలు అంటే భయం అనిపిస్తుంది.కానీ మొదటి పరీక్ష రాశాక ఆభయం బెరుకు తగ్గుతుంది. అందుకే ఏడాది పొడుగునా స్లిప్ టెస్ట్ రాసే పిల్లలకి పరీక్ష బెరుకు ఉండదు.క్లాసులు డుమ్మా కొట్టి చివరి మూడు నెలలు చదివితే లాభంతక్కువ. కాబట్టి ధైర్యం ఆత్మ విశ్వాసం ముఖ్యం.పిల్లలు ఆకథ విన్నాక ఆలోచన లోపడ్డారు.పెద్ద అవుతున్నకొద్ది ఎన్నో సమస్యలు వస్తాయి అని తెలుసుకున్నారు.ఎలుకలు కేవలం ఆహారం కోసం పారిపోయాయి.కానీ తాము సాధించాల్సినవి ఎన్నో ఉన్నాయని గ్రహించారు🌹
ఆత్మవిశ్వాసం! అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి