చీకటికి మాట పడిపోయింది
వెలుగుకు కంటి చూపు పోయింది
భూమి నడక ఆగింది
ఆకాశం చేతులు పడిపోయాయి
లోకం పిచ్చిది అయింది!!?
సరిగ్గా అప్పుడు
ఆమె అస్తమించింది!!
ఇంద్ర ధనుస్సు ను వేణువునీ చేసి
రంగుల్ని రాగాలుగా మార్చింది!
మేఘాల్ని నదులుగా మార్చి
భూభాగాన్ని నవవధువు గా చేసింది!!
మట్టిని చెట్టును కలిపి
పిట్టలను పుట్టించింది,!!
ఎగిరే గాలి కి రెక్కలిచ్చి
భూగోళాన్ని మోసే ప్రేయసి సిగ్గు అయ్యింది!!
భూదేవి భుజాలపై
పూల రంగు పరిమళం లా
ఆమె జలపాతం లా జారుతుంది!!?
చిట్టి నక్షత్రం చిరునవ్వు యెదలో
ఎన్నో ఉదయాలై ఉదయిస్తుంది !!
కరుగని మంచుకొండల్లో
మంచి మాటల సమాధుల్లో నుంచి
కుంకుమ పూలు ఆమె నుదుట
పూట పూట కూ పూస్తున్నవీ !!?
పేగుళ్ళోంచీ గుండెళ్ళోంచీ పారుతున్న
ఎర్రటి రక్తం సంధ్యావందనం ముందు
ధ్వజస్తంభంపై ఎగురుతున్న జెండా కాదు
అఖండ ప్రేమ జ్యోతి!!?
విలువల్లేని మట్టిని దిక్కరించి
గాల్లో కలిసి న ఏకైక ఏనుగు ఆమె
చచ్చినా బ్రతికినా ఒకటే విలువ!!?
వనవాసం లో రామునిలా
కైలాసంలో శివుని లా
ఇల్లు ఇల్లాలు లేని స్మశాన వనంలో
ఒక జత గా పూసిన జాతి పువ్వు ఆమె!!?
జారుతున్న లావానీముద్దాడి
జీవిత సముద్రాన్ని ఈదిన
తిమింగలం కాదు ఇంగిళంఆమే
ఆమె పాదమే పద్మం!!?
With memory of our beloved sister Padmavati on the 10th day 🙏❤️🙏
8309529273
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి