నెమలినాట్యం(చైనా కథ ఆధారంగా) అచ్యుతుని రాజ్యశ్రీ

 మన జాతీయ పక్షినెమలి ఎంత అందంగా పురివిప్పి నాట్యం చేస్తుందో మనందరికీ తెలుసు. ఆడనెమలికి పింఛం ఉండదు.దానికో కథ చెప్తారు. రెంటికీ పెద్ద తోకలుండేవి.కానీ చెన్ వాంగ్ అనే కొండజాతి పిల్లవాడి వల్ల  ఆడనెమలి తనతోకను పోగొట్టుకుంది.అతను కారడవిలోనెమళ్ల మధ్య పెరిగాడు. కానీ  ఒక దొంగల నాయకుడు  వాడిని ఎత్తుకుపోయి పెంచుకున్నాడు.వాడితోపాటు నెమలి పిల్లలుకూడా వెళ్లాయి.తను ఫ్లూట్ వాయిస్తూ వాటిచేత డాన్స్ చేయించి  డబ్బు సంపాదించే వాడు.కొంత కాలానికి వాడి నెమలిపిల్లలను చాలా మంది కొనుక్కుని తీసుకుని వెళ్లారు. దొంగ తనని పోషించటంతో వాడిని ఏమీఅనలేకపో యాడు.కొద్ది రోజుల తర్వాత దొంగ కూడా చనిపోతే ఒక సత్రంలో పనిచేస్తూ వారుపెట్టింది తింటూ ఓ రోజు గోడపై నెమలిబొమ్మ గీశాడు.ఓరోజు సత్రం యజమాని తో "అయ్యా!నేను నెమళ్లు ఉండే అడవికి వెళ్ళి అక్కడే ఉంటాను.గోడపై నెమలి బొమ్మ గీశాను.నాకు ఇంత ఉపకారం చేసిన మీకు  కృతజ్ఞతగా!మీరు మూడు సార్లు గట్టిగా చప్పట్లు కొడితే ఈనెమలి వచ్చి మీముందు ఎంచక్కా డాన్స్ చేస్తుంది. కాకపోతే రోజు కి ఒక్క సారిమాత్రమే గోడమీది నుంచి దిగివస్తుంది.ఇలా మీరు ధనవంతులు కావచ్చు "అని చెప్పాడు. సత్రం యజమాని  అలాగే చేసి  సంతృప్తి చెంది 
చెన్ వాంగ్ కి వీడుకోలు పలికాడు.జనం వచ్చి  ఆగోడపై నెమలి దిగివచ్చి నాట్యం చేయటంచూసి అబ్బురపడేవారు.ఆరోజు నించి  సత్రంకీ జనం తాకిడి ఎక్కువ ఐంది. మంచి పేరు డబ్బు గడించాడు సత్రం యజమాని. ఒక సారి  ఆదేశపురాజు వచ్చి  గోడపైనించి నెమలి దిగివచ్చి అద్భుతనృత్య ప్రదర్శన చూసి  అబ్బుర పడ్డాడు. "ఏదీ ఇంకోసారి  చేయించు"అని సత్రం యజమాని ని బలవంతపెట్టాడు.
"క్షమించాలి. ఇదికేవలం ఒకేఒక్కసారి గోడపై నించి దిగివచ్చి చేస్తుంది "అని మొత్తుకున్నా రాజు హుంకరించాడు"నిన్ను జైల్లో పడేస్తా"అనటంతో  పాపం అతను  నిస్సహాయంగా చప్పట్లు చరచంగా కీచుకీచుమంటూ ఆనెమలి గోడపై నించి దిగి తూలుతూ డాన్స్ చేస్తుంది. దాని తోక ఈకలు రాలిపోయి కోడిపెట్ట ఆకారంలో కి మారి హఠాత్తుగా బైటికి జారుకుని కంటికి కనపడకుండా మాయమైంది.ఆరోజు నించి ఆఊరివారికి నెమలి కనపడితే ఒట్టు!మనిషి కాని జంతువు పక్షి కానీ బలవంతపెడతే వారిలో సృజనాత్మకత నశిస్తుంది.ముఖ్యంగా పిల్లలని వారి అమ్మా నాన్న లు బైట వారు రాగానే "మాపాప భలే బాగా డాన్స్ చేస్తుంది. మాబాబు చాలా బాగా పాడుతాడు"అని చెప్పి బలవంతంగా అపరిచితుల ముందు  పాడించటం డాన్స్ చేయించటం తప్పు. పిల్లలకి విసుగు వస్తుంది. ఆకళలపై విముఖత పెరుగుతుంది. అందుకే  సర్కస్ లో పక్షులు జంతువులని నిషేధించారు 🌹
కామెంట్‌లు