తలకు రోకలి చుట్టండి ...పిచ్చి కుదురుతుంది;- సిరిపురపు సుబ్బారావు;-కలం స్నేహం

నాకు పెళ్ళి చేయాలని
ఎన్నోసార్లు అనుకున్నారు
ఇంట్లో అమ్మా నాన్నలు
ఎన్ని సంబందాలు వచ్చినా

ఏదో ఒక లోపం కన్పిస్తోంది
మనసుకు నచ్చడం లేదు
అందంగా ఉన్నా ఏదో ఒక
లోపం కొట్టచ్చినట్లు కన్పిస్తోంది

అందుకే ఎన్ని సంబంధాలు
వచ్చినా చూడటానికి అందంగా 
ఉన్నా మెల్ల కన్నో లేక మూగనో అలా ఏదో వంకతో
నాకు నచ్చకుండా ఉండేది

అలా రోజులు గడచి పోతున్నాయి
ఎన్నో సంబంధాలు వచ్చి పోతున్నాయి
ఒకసారి అమ్మాయి మనకు నచ్చక
మరొకసారి అమ్మాయే మనకు  నచ్చక ఎన్నో సంబంధాలు తప్పిపోయాయి.

ఇక లా‌భంలేదు ఎదో ఒక సంబంధం ఖాయం చౄయాల్సిందే అన్న నిర్ణయాకి వచ్చారు అమ్మానాన్నలు.

కుంటో కురోపో ఏదో 
ఒక పిల్లను తెచ్చి కట్టాలనుకున్నారు.
అంతలో ఎవరో అన్నారు పెళ్ళైతే పిచ్చికుదురుతుంది అని కట్రా రోకలిని 
తలకు చుట్రా అని

అవును ఇదో మంచి మార్గమేనని అమ్మా నాన్నలకు
ఈడూ జోడూ కుదిరితే చాలు అనుకొన్నారు

నిరీక్షించి విసిగి వేసారిన మనసులకు హాయి గొలిపించే సన్నని పాట 
మృధువు గా వినిపిస్తోంది

గానం మదురమే గాని
రూపమే కృష్ణ ఛాయ
అనుకున్నారు మనిషి బంగారం కాకున్నా
గుణం బంగారమైతే 
చాలు అనుకొన్నారు

పెళ్ళి కుదిరింది 
పిచ్చి తగ్గింది
పెళ్ళి కొడుకు
అందుకొన్నాడు ఓ పాట
రూపే నల్ల బంగార మాయెనే
నీ చూపే బంగారమాయెనే అంటూ..!


 
 

కామెంట్‌లు