సునంద భాషితం;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 సత్కారం.. ఛీత్కారం...
*******
సత్కార ఛీత్కారాలనేవి జీవితంలో తరచూ ఎదురవుతూనే ఉంటాయి.
సత్కారాలు తమ తమ రంగాలలో ప్రతిభ చూపినప్పుడు జరిగేవి కొన్నయితే,
పలువురి పరిచయాలు, పలుకుబడితో జరిగేవి మరికొన్ని...
ఏవి ఎలా జరిగినా అవి తీసుకున్నందుకు మరింత బాధ్యత పెంచుతాయనేది గ్రహించి వాటికి తగినట్లుగా గౌరవంగా, హుందాతనంగా ఉండాలి.
కానీ కొందరి విషయంలో.. అవి  అహాన్ని, అంతకు మించి గర్వాన్ని పెంచుతుంటాయి. తమంత గొప్ప వాళ్ళు లేమని భావన మాటల్లో చేతల్లో వ్యక్త పరుస్తూ తోటివారిని చిన్నచూపు చూస్తుంటారు.
 ఇక ఛీత్కారం.. ఇది మనసు గాయపడేలా చేసే  అవమానం.
కొందరు కావాలనే ఇతరులను ఛీత్కరిస్తూ తమ ఇగోను  చల్లార్చుకుంటారు.
 కానీ ఆ ఛీత్కారాన్ని సవాలుగా స్వీకరించి ఛీత్కారం స్థానంలో అసూయ కలిగేలా ఎదగాలి. అప్పుడే ఛీత్కరించే వాళ్ళు తలదించుకుని తమ ప్రవర్తనను  సరిదిద్దుకుంటారు.
 ప్రభాత కిరణాల నమస్సులతో🙏

కామెంట్‌లు