వసంత ఋతువున తొలి మాసం తొలి తిధి
యుగానికి ఆది యుగాది సృష్టి ఆరంభానికి పునాది
ఉత్తర ,దక్షిణాయనాల సమ్మిళిత సంవత్సరాది
సృష్టికర్త విధాతను భజించే పుణ్యతిధి
ఉగాది షడ్రచులు ప్రతి మదిలో మెదిలే భావానుభవాల ప్రతీకలు
సుఖ దుఃఖాల కలబోతలు
ఆనందం కల్గించు మధురమైన మమకారం
ఎక్కువైతే అదే అవుతుంది అంధకారం
విసుగు కల్గించు పులుపుదనం నేర్పుగా వ్యవహరిస్తే కాదా ఆనందాల సొబగుదనం
చుర్రున మండించే కారం తగ్గిస్తే
అదే బంధాలను పెంచే సహకారం
ఉత్సాహం నింపి ,విశ్వాసం పెంచే
లవణం కాదా మనిషిలో సుగుణం
పెను సవాళ్ళును ఎదుర్కొనే పొగరుదనం వగరుదనం
దుఃఖానికి పరాకాష్ట అయిన చేదు అనుభవాలను అధిగమిస్తేనే
అవుతుంది జీవితం మధురఫలాల రసాస్వాదనం
శుభకృతు వత్సరం సకల శుభాలను అందించి మనసున హర్షం వర్షంచి
జగతిని పులకాంకితం కావించి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి