శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం...
కౌసల్యా సుప్రజా రామ పూర్వాసంధ్యా ప్రవర్తతే । ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్ ॥
ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ ।
ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు ॥
మాతస్సమస్త జగతాం మధుకైటభారేః
వక్షోవిహారిణి మనోహర దివ్యమూర్తే ।
శ్రీస్వామిని శ్రితజనప్రియ దానశీలే
శ్రీ వేంకటేశ దయితే తవ సుప్రభాతమ్....
- అంటూ సాగే శ్రీ వేంకటేశ్వర సుప్రభాతాన్ని
కర్ణాటక సంగీత విద్వాంసురాలు ఎం.ఎస్. సుబ్బులక్ష్మి గొంతులో వింటుంటే సాక్షాత్తూ ఆ తిరుమల గోవిందుడు మన కళ్ళముందు ప్రత్యక్షమయ్యేడా అన్నంత భక్తిభావం కలుగుతుంది.
1958లో వైకుంఠ ఏకాదశి రోజున మొట్టమొదటిసారిగా ఎంఎస్. సుబ్బులక్ష్మితో ఈ సుప్రభాతాన్ని ఇరవై నిముషాలు పాడించి ప్రసారం చేసింది ఆలిండియా రేడియోవారు. ఆతర్వాత మరో అయిదేళ్ళకు 1963లో గ్రాంఫోన్ రికార్డుగా ఈ సుప్రభాతం వచ్చింది. శ్రీనివాసుడి కీర్తించే వేంకటేశ్వర సుప్రభాతాన్ని తిరుమల తిరుపతి దేవస్థానంవారు ప్రసారం చేయటమే కాకుండా 1975లో సుబ్బులక్ష్మిని దేవస్థాన ఆస్థాన విద్వాంసురాలిగా నియమించారు.
ఇప్పుడీ వేంకటేశ్వర సుప్రభాతాన్ని నేటి తరానికీ, భావితరానికీ మరింత చేయాలనే ఉద్దేశంతో సుబ్బులక్ష్మి మునిమనవరాళ్ళ యిన ఎస్. ఐశ్వర్య, ఎస్. సౌందర్య పాడగా మాండొలిన్ కళాకారుడు యు. రాజేష్ సంగీతం స్వరపరిచారు. ఈ సుప్రభాత ఆల్బంని సంగీత జ్ఞాని ఇళయరాజా ఆవిష్కరించారు.
ఐశ్వర్య, సౌందర్యలు అక్కచెల్లెళ్ళు. వీరు ఓంకార్ నాథ్ హవల్దార్ దగ్గర హిందుస్థాని శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకుంటున్నారు.
ఆరు నెలలపాటు రాగ స్పష్టత కోసం సంస్కృత పదాల ఉచ్చరణ కోసం శ్రమించిన తర్వాత సుప్రభాతాన్ని పాడినట్టు ఐశ్వర్య, సౌందర్యలు చెప్పుకున్నారు. వీరు బెంగుళూరూలో ఉంటున్నారు.1999లో వీరు చెన్నై నుంచి బెంగలూరు వెళ్ళారు. వీరి తండ్రి వి. శ్రీనివాసన్ ఓ స్విస్ సంస్థకు పదిహేడేళ్ళ పాటు పని చేశారు. పరిమళద్రవ్యాలు తయారు చేసే స్విస్ సంస్థ Givaudanకు ఫ్యాక్టరీ బెంగళూరులోని జిగానీలో ఉంది. ఈ సంస్థ పలు సంస్థలకు వివిధ పరిమళద్రవ్యాలను పంపిణీ చేస్తుంది. తమ కూతుళ్ళను చూసుకోవడం ఆయన 2016లో ఉద్యోగం మానేశారు.
ఐశ్వర్యకు 2010లో మొదటిసారిగా శ్రీనివాసన్ తల్లి రాధ సుప్రభాతాన్ని నేర్పారు.
సుబ్బులక్ష్మి 2004లో కాలధర్మం చెందినప్పుడు ఐశ్వర్య వయస్సు తొమ్మిదేళ్ళు.
రాధా విశ్వనాధన్ త్యాగరాజన్ సదాశివం - అపితా కుచాంబాళ్ అలియాస్ పార్వతి దంపతుల కుమార్తె. 1940లో అపితాకుచాంబాళ్ మరణానంతరం సదాశివం ఎం.ఎస్. సుబ్బులక్ష్మిని వివాహమాడారు. రాధ సుబ్బులక్ష్మితో కలిసి పాడుతుండేవారు. సుబ్బులక్ష్మి తదనంతరంకూడా రాధ కచేరీలు చేశారు.
సుబ్బులక్ష్మి, రాధలు ఎలా పాడేవారో అట్లానే ఐశ్వర్య, సౌందర్యలు ఇప్పుడు పాడుతున్నారు. ఐశ్వర్య స్వరం కాస్తంత సన్ననిదైతే సౌందర్య స్వరం హైపిచ్ లో ఉంటుంది. అయితే కలిసి పాడేటప్పుడు వీరి శృతిలో ఎక్కడా తేడా రాకుండా వినడానికి సొంపుగా ఉంటోంది. ఐశ్వర్య వీణకూడా వాయిస్తారు. బెంగళూరుకి చెందిన బి. నాగలక్ష్మి దగ్గర ఆమె వీణ నేర్ఛుకున్నారు. ఇళయరాజా సంగీతంలోని సినీ పాటలను అడపాదడపా వినే ఐశ్వర్య ఎక్కువగా వినేవి శాస్త్రీయ కీర్తనలనే. ఇక సౌందర్యేమో నీలా రాంగోపాల్ దగ్గర గాత్రసంగీతాన్ని నేర్చుకున్నారు. అలాగే రిషీకేశ్ హరి వద్ద పియానో నేర్చుకున్న సౌందర్య పాశ్చాత్య వయోలిన్ ని ప్రఫుల్ల మోండల్ దగ్గర అభ్యసించారు.
ఐశ్వర్య, సౌందర్యలు కలిసి ఆలపించిన శ్రీ వేంకటేశ్వర సుప్రభాతంలో మొదటి శ్లోకం వాల్మీకి రామాయణంలోనిది మిగిలిన సుప్రభాతమంతా ప్రతివాది భయంకరం అణ్ణంగరాచార్య వారు రాసినదే. ఈయన తమిళ, సంస్కృత భాషలలో దిట్ట. ఆయన ఎన్నో రచనలు రచనలు చేశారు. వాటిలో విశేష ఆదరణ పొందిందీ సుప్రభాతం. శ్రీరామానుజాచార్యులచే నియమింపబడిన 74 సింహాసనాధిపతులలో ఒకరైన 'ముడుంబ నంబి' వంశానికి చెందినవారు. ఆయన గురువు మణవాళ మహాముని.
వేంకటేశ్వర సుప్రభాతం సుప్రభాత సేవలో కీర్తించే స్తోత్రం. "సు-ప్రభాతం" అంటే "మంచి ఉదయం" అని అర్థం. భోగశ్రీనివాసుణ్ణి ఈ సుప్రభాతంతో మేల్కొల్పుతారు. బంగారు వాకిలిలో పదహారు స్తంభాల తిరుమామణి మంటపంలో ఈ సుప్రభాతాన్ని పఠిస్తారు. సుప్రభాత పఠనానంతరం భోగశ్రీనివాసుని గర్భగుడిలోనికి తీసికొని వెళతారు. 1430 సంవత్సరంలో శ్రీవీరప్రతాపరాయల హయాంలో వేదపఠవంతోపాటు సుప్రభాత పఠనం కూడా మొదలైంది. అప్పటినుండి క్రమంతప్పక ఈ సంప్రదాయం కొనసాగుతుం
డటం విశేషం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి