ఒకరిని చూసి మనం అనుకరించే ప్రయత్నం చేయరాదు.మంచి విషయాలు వారి నడవడిక ను అనుసరించవచ్చు కానీ వారిలా గొప్పలకు పోతే తిప్పలు తప్పవు. ఒకప్పుడు పాటలీపుత్రంలో మణిభద్రుడనే వ్యాపారి ఉండేవాడు. అందరినీ సమానంగా ప్రేమిస్తూ ధార్మిక పనులు చేసేవాడు. అలాదాన ధర్మాలు చేసి చేసి అతని ఆస్తి అం తా హారతికర్పూరంలా హరించుకుపోయింది.డబ్బుకి లోకం దాసోహం.డబ్బు లేనివాడు డుబ్బుకి కొరగాడు.అందుకే జనం అతన్ని పట్టించుకోటం మానేశారు. లోలోపల కుమిలిపోతూ"నాబతుకు దండగ.ఆకలితో మాడి చావుని ఆహ్వానిస్తాను."అని ఆలోచిస్తూ నిద్ర లోకి జారాడు.కలలో అతనికి ఓసాధువు కనపడ్డాడు. "మణిభద్రా! దిగులు పడకు.రేపు నేను నీఇంటికిరాగానే కర్రతో నాతలపై బాదు.నీకు కావల్సినంత బంగారం కురిపిస్తా"అని చెప్పాడు. తెల్లారుతూనే బైరాగి వాకిలిముందు నించోటంచూసి అతని తలపై కర్రతో బాదాడు.వెంటనే బంగారు కణిక లా మారాడు ఆసాధువు.ఇదంతా ఇంటిపక్కన ఉన్న పేరయ్య చూశాడు. దురాశ పరుడైన అతను ఇలా ఆలోచించాడు."రేపు తెల్లారుతూనే ఒక బైరాగిని నాఇంటికి రమ్మని ఆహ్వానిస్తాను.వాడినెత్తిపై కర్రతో బాదుతాను."అని ఆరోజు ఓపాడుబడిన మఠం దగ్గర పడుకున్న ఓబిచ్చగాడిని చూసి "రేపు నీవు ఎవరినీ బిక్షంవేయమని అడగకు.సరాసరి నాఇంటికి తెల్లారుతూనే వచ్చేయి.నీకు కడుపు నిండా రకరకాల వంటకాలు పెడతా "అని ఆశపెట్టి వాడిచేతిలో ఓరాగినాణెంపెట్టాడు.పాపం ఆముసలాయన అలా పడుతూ లేస్తూ లోభిఇంటి తలుపు తట్టాడు.కర్రతో సిద్దంగా ఉన్న అతను ఆబిచ్చగాడి బుర్రపై ఠపీమని బాదటం అతను "చచ్చానురా దేవుడా!"అన్న గావుకేకతో ఇరుగుపొరుగు గుమిగూడి ఆదురాశాపరుడిని కొత్వాలు కి అప్పజెప్పారు.వాడికి యావజ్జీవ కారాగారశిక్ష పడింది. తెలిసీతెలియకుండా ఒకరిని గుడ్డిగా నమ్మడం అనుకరించటం కూడదు సుమా! మనతాహతు శక్తి చూసుకోవాలి అంతే 🌷
అనుకరణ! అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి