బృహస్పతి. పురాణ బేతాళ కథ.; - డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై
 విక్రమార్కుడు చెట్టువద్దకుచేరి శవాన్ని ఆవహించి ఉన్నబేతాళుని బంధించి భుజంపైనచేర్చుకుని నడవసాగాడు.
అప్పుడు శవంలోని బేతాళుడు ' మహరాజా నీ పట్టుదలమెచ్చదగినదే నాకు బృహస్పతి గురించి తెలియజేయి. తెలిసి చెప్పకపోయావో మరణిస్తావు' అన్నాడు.
' బేతాళా వేదము ఋక్కులలో శుక్ర బృహస్పతి లున్నారు. అందులోనే శుక్ర-మంధిక్- పదములు గ్రహార్ధకములుగా కనిపించును. తత్తిరీయ సంహిత అందు గ్రహశబ్దమునకు యజ్ఞపాత్ర అని అర్ధము. ఐతిరేయ, శతపధబ్రాహ్మణములందలి గ్రహ శబ్దమునకు సోమరసము గ్రహించు పాత్ర అని అర్ధము. ఐతరేయ బ్రాహ్మణం లో సోమపాత్రలు తొమ్మిది, గ్రహములను తొమ్మిది. సోమరసమును గ్రహించును కావున గ్రహ మనగా సోమ-పానపాత్ర.
సూర్యాదులయెడల గ్రహ శబ్దము ప్రసిద్ధము. గ్రహశబ్దమునకు గ్రహణ' మనియు అర్ధము ఉంది. భానోర్ గ్రహే, సకలగ్రహే అని సూర్యసిద్ధాంతము. సూర్యగ్రహణమునకు సూర్యుని గ్రహించుట. రాహువు ఆక్రమితును కావున రాహువు గ్రహము.
అన్ని మన్వంతరములందును అందరు దేవతలను సుర్యనక్షత్రములను ఆశ్రయించుకొని యుందురని పురాణములు చెప్పును. చంద్రసూర్యాదులు గ్రహములు. పుణ్యపురుషులకు నక్షత్రములవలెనే దేవతలకీ సూర్యచంద్రాదులు గృహములు.
చంద్రుడు, సూర్యుడు మొదలగు తేజ పిండములనుద్దేశించి యజ్ఞములందు వేరువేరు పాత్రలకు వాడుక ఉంది. కాలక్రముమున ఆపేరులే తేజ్ఃపిండములకు వాడుక ఆయెను.
గ్రహముల పరస్పర సామీప్యముగాని, గ్రహనక్షత్రముల సామీప్యముగాని కలిగినప్పుడు సంగ్రామము కలుగును. క్రాంతివృత్తమున ఉత్తరార్ధమున దేవగణమును, దక్షిణార్ధమున అసురగణమును ఉండునని ప్రసిద్ధము. ఇవియే గ్రహముల సంధానము.
బృహస్పతి
కొన్ని వేదము ఋక్కులలో బృహస్పతి అగ్ని అని భావించారు. ఇతడు యజమానులకు పురోధ (పౌరోహితుడు). దేవతలకు గురువు.ఋషి.సప్తఋషులలో ఒకడుగు అంగిరునకు బ్రహ్మతేజో రూపముగా బృహస్పతి పుట్టెనని పరాశరుడు చెప్పెను. బృహస్పతి అంగిరునకు శుభ కడుపున పుట్టెను. ఇతనికి తేజస్సు అధ్యయన సంపద ప్రతిభావిశేషము మంత్రశక్తియు అత్యధికము కావున ఇతనికి బృహస్పతి అని పేరు వచ్చెను అని మహా భారతము చెప్పు చున్నది.
అతి పురాతన కాలమునకే ఇతని ఉనికిని తెలియుననుటకు తారకాణగా పరాశరుడితనిని బ్రహ్మ మానసపుత్రుడని వచించెను. ఇతడు తిష్యలో పుట్టెనని తైత్తిరీయబ్రాహ్మణము. సూర్యుడును, చంద్రుడును, బృహస్పతియు ఏకకాలములో (కర్క) పుష్యమిలో సమ్మిళితురగురని అపుడు సత్యయుగ మావిర్భవించునని విష్ణు పురాణము చెప్పెను.
ఇతనికి జీవుడని ఒక పేరుకలదు. ఋగ్వేదము న ఇతడు పుష్టివర్ధకుడు. ఓషధులకు జనకుడు. ఇతడు దేవాసుర సంగ్రామమున చనిపోయి దేవతలకు దివ్యౌషధములు ఇచ్చి బ్రతికించుచుండువాడు కావున జీవుడని పేరు వచ్చెను.
బృహస్పత్కి వాక్ప్తతి అని పేరు ఉంది. ఇది ఫల జ్యోతిష్యమునకు వ్యాపించెను.
ఇతడు ఫల్గునిలో పుట్టెనని వాయు పురాణము చెప్పెను. కావున ఇతడు ఫల్గునీభవుడు ' అన్నాడు విక్రమార్కుడు.
అతనికి మౌనభగంకావడంతో, శవంతోసహా మాయమైన బేతాళుడు తిరిగి చెట్టువద్దకు చేరాడు.పట్టువదలనివిక్రమార్కుడు బేతాళునికై వెనుతిరిగాడు.

కామెంట్‌లు