మలద్వారం వద్ద నొప్పి, మంట -నివారణ.
తీవ్రమైన ఎండతాకిడి వల్ల శరీరం
ఎన్నో రకాల బాధలకు గురి అవుతుంది. మలద్వారం నొప్పి, మంట, దురదలు చాలా అసౌకర్యం తో ఇబ్బంది పెడతాయి.
ఇది ఎవరికయినా చెప్పుకోవాలన్న
కష్టం. కానీ దీనికి మంచి పరిష్కారం వుంది.
కొన్ని కరివేపాలను ( మరీ ముదురుగా లేనివి ) తెచ్చి బాగా కడిగి, ముద్దగా దంచి కొద్దిగా తాటి బెల్లం వేసి నీరుపోసి మరిగించి కషాయంగా కాచి చల్లార్చి, త్రాగాలి.
నొప్పి, మంట తగ్గి పోతుంది.
2.
కొన్ని కుప్పింటాకులను, లేత వేపాకులను తెచ్చి బాగా కడిగి
ముద్దగా నూరి కొద్దిగా నేతిలో
వేయించాలి. గుండ్రని చిన్న ముద్దగా చేసి మింగి నీరు త్రాగాలి.
దీనితో కూడా మలద్వారం నొప్పి, మంట తగ్గి పోతుంది.
ముఖ్యంగా మలబద్ధకం లేకుండా
చూసుకోవాలి. త్రిఫల చూర్ణాన్ని గాని, కరక్కాయ పొడిని గాని
నీళ్ళల్లో కలిపి త్రాగుతుండాలి.
శరీరానికి వేడిని కలుగజేసే ఆహార పదార్థాలు తినకూడదు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి