మనము... మనది
మేము.... మాది
నేను... నాది.....
చివరకు ఏదీ లేదు !
నిరాశావాదమనుకుంటున్నావా
నిఖార్సయిన చైతన్య ప్రబోధం
మూన్నాళ్ళ ముచ్చటకు
మురిసిపోయి,మై మరచిపోయి
అన్నీ నాకే రావాలి . అంతా నాదేకావాలి అనుకుని, పది తరాలకు తిన్నంత ఉన్నా ఆర్జ న కోసం అక్రమాలు చేస్తూ...
అధికారం కోసం కుతంత్రాలూ వెన్నుపోట్లతో...ప్రశాంతత నెం దుకు పోగొట్టుకుంటావ్ !?
బ్రతికున్నంత కాలంఅశాంతితో
అనారోగ్యాలపాలు చేసుకోవట మెందుకు ?!
అందుకే... చెబుతున్నా
ఈ అనంత కాల గమనంలో...
మన ఉనికి క్షణ భంగురమే !
ఈ లిప్తపాటు జీవితానికి...
ఇన్నిన్ని యాతనలెందుకు !?
ఇది తెలుసుకుంటావనే....
అది చెప్పింది !
అర్ధం చేసుకో... శాంతినిపొందు తావ్ !
. . జ్ఞానమేనోయ్ ఆనందం,
తృప్తిలో ఉన్నంత ఆనందం...
మరెందులోనూ లేదోయ్ !
ఉన్నదానితో తృప్తి పడు... పేరాసతో... దురాశా పరుడవై
జీవితాన్ని దుఃఖ భూయిష్టం చేసుకోకు... !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి