ప్రార్థన (బాలగేయం);-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
సరస్వతీదేవి సర్వవిద్యల తల్లి
పరమేష్టి రాణి మము పాలించవమ్మా 
!!సరస్వతీ!! 

శ్వేత మరాళముపైని శుద్ధకళ్యాణీ
కోటి సూర్యప్రభలతో కొలువైనవమ్మా నలుమొగము వేలుపును చేపట్టినావూ పలుకు వెలదిగ నిన్ను పూజింతునమ్మా
!!సరస్వతీ!!

లలిత మృదుపాణి ఓ శారదాంబా
కేలుమోడ్చి నిన్ను నుతియింతునమ్మా పల్లవారుణపాద ఓ వాణిమాతా 
నీ పదమంటి నిన్నునే గొలుతునమ్మా 
!!సరస్వతీ!!

సరిలేరు నీకెవ్వరీ క్షితిలోనా 
నా మనవి చేకొనవె భారతి దేవీ వీణాపుస్తకపాణి ఓ గీర్వాణీదేవీ 
సకల విద్యలు నాకు దయజేయవమ్మా !!సరస్వతీ!!


కామెంట్‌లు