""మ ""ప్రాసాక్షర గేయం ;-ఎం. వి. ఉమాదేవి
నమశ్శివాయ పలుకుదము 
గమకములను పలికించెదము 
కమనీయరూపమే తలఁచెదము 
ఉమపతికి దాస్యమున ఒదిగెదము 

హిమగిరి తనయను కొలిచెదము 
ప్రమథగణములను పిలిచెదము 
శ్రమతో నృత్యము సలిపెదము 
ఢమరుకమును మ్రోగించెదము!

విమలతటాకము మునిగెదము 
కమలములను గొనివచ్చెదము 
భ్రమరాంబను సేవించెదము 
క్రమము గణపతిని వేడెదము !!


కామెంట్‌లు