పుస్తక పఠనము;- *మాడుగుల మురళీధర శర్మ
 ఛందస్సు: వివిధములు
*******
1కందము 
చీనాంబరముల కట్టుచు;
ధారుణిలో పుస్తకమ్ము*
ధరతో గొనుమా!
పారంగతధారణతో
శారదమాతాకటాక్ష*
సారము తెలియున్!
2 ఉ.మా.
నీరజనేత్రిశారదఘ*నీభవ
సాహితి సారసత్వముల్!
కోరెడు భావనాపరులు*
కూరిమిపెక్కుగపుస్తకమ్ములన్!
ధారణతోడుతన్ మనన*
తప్పక చేయగనర్థవంతమౌ!
పారెడువిద్యనందెదరు*
పద్మజురాణిసువాణిదీవెనన్!
3 ఉ.మా.
తాతలకాలమందునిల*
తాళసుపత్రములందుఘంటముల్!
ప్రీతిగ వాడుచున్ రచిత*
వేలకువేలగు కావ్యరాజముల్!
యీతరసాహితీపరుల*
కీప్సిత సిధ్ధిగనందజేయగా!
పాతతరాలకావ్యములు*
ప్రస్తుతపొత్తములౌచువెల్గెగా!
4 కందము
పుస్తక పఠనము చేయగ
మస్తకమునుచురుకునొందు*
మహిమాన్వితమై!
విస్తారితవిజ్ఞానపు
వాస్తవ విషయాలుతెలియు*
వసుధనసుమతీ!
5 కందము
అక్షర మాలను నేర్చిన
నక్షయమగువిద్యవచ్చి*
నటులేలౌనో!
కుక్షిస్థాఖిలవిద్యల
రక్షించునుశాశ్వతముగ*
రహిపుస్తకమే!
6 కందము
పుస్తకము కరసుభూషణి
పుస్తకము నుపరులకీయ*
పోయిన సొమ్మే!
వస్తేగిస్తే తిరిగది
నస్తవ్యస్తమ్ముచినిగి*
నందును తుదకున్!
7 కందము
పుస్తక భాండాగారము
మస్తకముననిండియుండ*
మాన్యతపెంచున్!
విస్తారకపఠనమ్మే
మస్తిష్కమునందునింపు*
మహనీయతతో!

సౌగంధీవృత్తము
గ్రాంధికమ్ముకష్టమంచు*
గాలిలోనవీడకూ!
గ్రంధభాష నేర్చుకున్న*
కష్టమేదికాదుగా!
గ్రంధశాలలెన్నొనేడు*
గాంచుచుండెచూడగన్!
యిష్టమైనపుస్తకాల*
నిచ్ఛతోడ వాడుమా!
9కందము
ముఖపుస్తకమునువాడెడు
నఖిలాంతరవిశ్వమందు*
నందుండుజనుల్!
నిఖిలమునదృశమునందును
సఖినిజపుస్తకమువినుడి*
శాశ్వత మదియే!
10కందము
పుస్తకములగొని చదివిన
మస్తకములుచురుకునొంది*
మదిపులకించున్!
విస్తారవిషయజ్ఞానపు
ప్రస్థారములెరిగివిద్య*
ప్రసరణమొందున్!
        
11.సీసము
పుస్తకచదువున*పూర్వవిజ్ఞానమ్ము!
మస్తకముననిండ*మనుజులందు!
అజ్ఞానమునుపోయి*విజ్ఞానమందును!
మనిషి ప్రవర్తన*మార్పువచ్చు!
విషయపరిజ్ఞాన*వివిధరీతులవల్ల!
సంస్కార మందును*సర్వజనులు!
సంస్కరింపబడును*సమసమాజమ్మంత!
శాంతిప్రశాంతితో*జిగృతిగను!
తే.గీ.
పుస్తకమ్ములు చదివిన*పుణ్యమబ్బు!
పూర్వజన్మాలపాపాలు*పారిపోవు!
సమసమాజాన విలువలు*సంతరించు!
పుణ్యఫలమునజీవిగా*మోక్షమందు!
🙏🙏🙏🙏🙏

కామెంట్‌లు