"మణిపూసలు" పుస్తకాలను ఆవిష్కరించిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి*;-వెంకట్ మొలక ప్రతినిధి:
విద్యార్థులను అభినందించిన విద్యా శాఖ మంత్రి

100 పద్యాలతో పుస్తకాలను రచించిన 11 మంది సంఘం వికారాబాద్ లక్ష్మీ బాయి గురుకుల  విద్యార్థినిలు
వికారాబాద్ తెలుగు సాహిత్య రంగంలో నూతనంగా ఆవిష్కరించబడిన మణిపూసలు అనే మాత్రాఛందస్సు ప్రక్రియ రచనలు చేసిన సంగం లక్ష్మీబాయి పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థుల పుస్తకాలను గురువారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆవిష్కరించారు. పాఠశాలకు చెందిన కె నందిని (నందనవనం), శ్వేత (శ్వేత పత్రం), వాసిక ( కొత్త స్వరం), అపూర్వ (ఆహ్లాదం), అశ్విని (మనో మంజరి), కావేరి (అక్షర ప్రవాహం), హర్షిత (హర్షణీయం), అక్షిత (అక్షర కిరణాలు), శ్రావణి (శ్రవణ శబ్దాలు), స్పందన (జ్ఞాన పదాలు) పుస్తకాలను ఆవిష్కరించి అభినందించారు ముందు ముందు రచయిత్రులు కవయిత్రులు కావాలని అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఆయాచితం శ్రీధర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళి కృష్ణ నారాయణపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శాసం రామకృష్ణ ఎమ్మెల్యే లు మెతుకు ఆనంద్ రోహిత్ రెడ్డి,  తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మెంబర్ పటేల్ శుభ ప్రద్ పటేల్ ప్రిన్సిపాల్ డాక్టర్ గోపిశెట్టి రమణమ్మ, తెలుగు భాష ఉపాధ్యాయుడు అంజిలప్ప, విద్యార్థులు పాల్గొన్నారు,

కామెంట్‌లు