మనము.... మనది
. మేము... మాది
నేను... నాది
చివరికి...ఏదీలేదు !
******
ఓ గొప్ప గ్రంధం...
కావలసిన జీవితం !
అయిపోయింది...
లెక్కలపుస్తకం... !!
******
ఉన్న స్థితినుండి
అత్యున్నతస్థితికి
బాగాఎదిగాడు
మానవత్వం మాయం !
*******
కని, పెంచటం....
పూర్వ జన్మ పుణ్యం !
పెంటమీద పారేస్తే ...
మూటగట్టిన పాపం !!
********
మోజుతీరింది....
వీడి పోయారు !
కామ మైకాన్ని...
ప్రేమనుకున్నారుపాపం!!
********
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి