నేటికవిత :- కోరాదనరసింహా రావు !

 🙏స్వాగతింతము 🙏
   ********
వచ్చేసింది.... * ఉగాది *
   ఎన్నెన్నో ఆశయాలు, ఆశల కలలను నిజంచేస్తానన్నభరోసా ను మోసుకొస్తూ,తన శుభకృత్ 
నామమ్మును సార్ధక్యము చేసి కొనగా.... !
        తీపి, పులుపు, వగరు, చేదు..అనుభవాలే జీవితమను 
సత్యమును గ్రహించి, స్వాగతించి అనుభవించు... 
 నరులమందరం  
      రంగవల్లులు, మంగళ తోరణముల నూతన శోభలను అద్ది...,శుభములే చేకూర్చ మనుచు... భక్తి, శ్రద్దల పూజ సేతుము యుగాది పురుషు నకు, దేవతలందరూ దీవించు నటుల... !!
   కానున్నది కాకమానదు !
ఐనా... యీ సంవత్సర మెట్లున్నదోపంచాంగ శ్రవణముతో  తెలుసుకొనగ ఉత్సుకత !
      జరువబోవు శుభములకై  ఆరాటపు ఎదురుచూపు !
 అవాంఛనీయ అశుభములు 
తలుచుకునే బెదురూ చూపు!
      విజ్ఞతతో సిద్దపడుటే     మనిషికున్నవివేకం !!
      *******
కామెంట్‌లు