సునంద భాషితం;- వురిమళ్ల సునంద ఖమ్మం
 ఆశకూ...ఆస్తికీ...
*******
ఆశకూ, ఆస్తి అపరిమితంగా సంపాదించాలనే  కోరికకూ హద్దూ పద్దూ అంటూ ఉండదు.
మనసెప్పుడూ  నిరంతరం ఆశలతో  రగులుతూనే  ఉంటుంది. ఒక ఆశ తీరిందో లేదో మరో ఆశ నేనున్నానంటూ ముందుకు వచ్చి నిలుస్తుంది.
వాటిని నివారించడం  కేవలం స్థితప్రజ్ఞత గల వారికే సాధ్యం.
ఇక  ఆస్తి బాగా సంపాదించాలనే కోరిక  మొదలయ్యిందా...
సమయాసమయాలు చూడకుండా ,బంధాలకు అనుబంధాలకు విలువ ఇవ్వకుండా సంపాదనే ధ్యేయంగా మనసును దాని వెంటే పరుగులు తీయిస్తుంది.
ఇలా …అంతులేని ఆశలకు, అపరిమిత ఆస్తి  సంపాదనకు మనసును కేంద్రీకరించి వాటి వెనుక పరుగెత్తే వారికి  మొదట్లో సంతోషం అనిపించినా ఆ తర్వాత కోల్పోయిన మనశ్శాంతి విలువేమిటో తెలిసొస్తుంది.
ప్రభాత కిరణాల నమస్సులతో🙏కామెంట్‌లు