కష్టకాలంలో
కన్నీరు కనికరాన్ని కోల్పోయింది
ధనాపేక్షకు లోనై....
స్వార్ధానికి దాసోహమై
కరుణను విడిచిన
చూపు చీకటయింది...
మనదనకున్న
సమాజంలో
మాట సాయం కూడా
వెన్ను తట్టడానికి
వెనకాడింది...
మనది కాదనుకున్న
పరాయితనం
అడుగుల ధైర్యాన్ని
చేయలేకపోయింది...
స్వీయ ప్రయోజనాల
సముపార్జనలో
సామాజిక స్పృహ
మాసిపోయింది...
పరుల కష్టం
పరులదే అన్న
భావం ముందు
వ్యక్తిత్వం
నైతికతను విడిచిపెట్టింది...
భావోద్వేగాల
స్పందనను కోల్పోయి
గుండె బండ రాయిలా
ఎప్పుడో
మారిపోయింది...
వ్యక్తిగత
విలువలతో బ్రతికే
మనుషులలో వున్న
కాస్తంత మానవత్వం
కరువైపోయింది....
కరువైపోయిందని
వాస్తవికతలో
రుజువైపోయింది...
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి