స్ఫూర్తి కెరటాలు;-డా.నీలం స్వాతి,చిన్నచెరుకూరు గ్రామం,నెల్లూరు.Ph.no 6302811961
 పుస్తకాల మైదానంలో కనుచూపుమేర కాంతి కిరణాలు ప్రజ్వలిస్తుంటాయి...
ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే నిశ్శబ్ద రాగాలు ఆత్మీయంగా కౌగలించుకుంటాయి... 
పాఠకుల స్పర్శను నోచుకుని పేజీల పూలు పరిమళిస్తుంటాయి...
అక్షరాలతో స్నేహం మొదలవగానే క్షణాలు కాస్తా కనుమరుగవుతుంటాయి...
కవుల, రచయితల హృదయాలలోని కొత్త కొత్త కోణాలు ఆవిష్కృతమవుతుంటాయి...
అన్వేషణ మార్గాలలోనే ఘడియలు గంటలుగా, గంటలు రోజులుగా మారుతూ ఉంటాయి... 
మెరుగైన ఆలోచనలు మొదలవగానే చీకటి చెరలు వీడిపోతుంటాయి...
అక్షర శాసనాల నడుమ పరివర్తన మార్గాలు మరింతగా బలపడుతుంటాయి...
చక్కని రాతల చిక్కని సిరాచుక్కలు నవ యువ ఆలోచనలకు మెరుగులద్దు తుంటాయి....
ఊహల,వాస్తవాల ఊగిసలాటలో ఊరేగి, జీవిత సారాన్ని గ్రహించి, మానవత్వపు రంగులు 
పులుముకున్న స్ఫూర్తి కెరటాలు సమాజపు ఒడ్డుకు చేరుతూ ఉంటాయి...కామెంట్‌లు