విజయ రహస్యం ...... 1 .;-ఎం. వి. సత్యప్రసాద్ - సెల్ 9398155633
 మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీతో చర్చించ బోయే అంశం  " జీవితం లో పైకి రావాలంటే, ఏం చెయ్యాలి ".  ఆంటే పైకి రావటం అంటే ఆర్ధికం గా , సామాజికం గా , సమాజం లో ఒకడిగా ఎదగడం,  ఫామిలీ స్టాండర్డ్ అఫ్ లివింగ్ ను పెంచడం.మొ //.
మన సమాజం లో ప్రజలు .. మరీ పేద ప్రజలు, (అంటే కూటికి , గుడ్డ కు కూడా వెతుక్కునే వాళ్ళు ),  తిండి బట్ట మటుకే ఉన్న వాళ్ళు , మధ్య తరగతి వాళ్ళు , హై క్లాస్ వాళూ ఉంన్నారు . ఈ మధ్య మరో కొత్త వర్గం సాఫ్ట్ వేర్ రంగం మొదలయ్యాక వచ్చింది. అది హై క్లాస్ కి , మిడిల్ క్లాస్ కి మధ్య ఎబోవ్ మిడిల్ క్లాస్.  గత పదిహేను సంవత్సరాలు గా ఈ వర్గం డెవలప్ అయింది.
సామాన్యం గా హై క్లాస్ మరియు అబొవె మిడిల్ క్లాస్ వర్గం గురించి మనం తర్వాత మాటాడు కుండం. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ పైకి  ఎదిగిన వాళ్ళు. మరి మనం మాటాడు కోవలసినవాళ్లు .. మధ్య తరగతి కుటుంబీకులు .  వీళ్ళు ప్రతి విషయం లోనూ అంటే చదువు, ఉద్యోగం లేదా వ్యాపారం, ఫామిలీ , పిల్లలు వాళ్ళ చదువులు, వాళ్ళ పెళ్లిళ్లు మొ // అన్నీ ఒక క్రమ పద్దతి లో అంటే ప్లానింగ్ కరెక్ట్ గా చేసుకోవాలి.  లేకుంటే ఇబ్బంది పడతారు. ఎన్నో ఏళ్ళు గా ఎదుగు బొదుగూ లేకుండా మధ్య తరగతి కుటుంబం లో పుట్టి, మధ్య తరగతి లోనే పెరిగి , మధ్య తరగతి కుటుంబీకుకు గానే చనిపోతాడు.  ఇక పోతే పేద ప్రజలు .. ఏ రోజుకు ఆ రోజు వెతుక్కోడమే.
నా ఉద్దేశ్యం లో మనిషి ఎదగాలంటే మనం ఎంచుకునే మార్గం మంచిదయ్యుండాలి . చెడు మార్గం లో వెళ్లి కూడా ఎదగవచ్చు. కానీ అది ఏదో ఒక రోజు ప్రమాదాన్ని తెఛ్చి పెడుతుంది. మనతో పాటు మన ఫామిలీ , పిల్లలు మరియు తల్లి తండ్రులు బాధ పడాల్సి వస్తుంది.


మన ఆలోచనా విధానం పాజిటివ్ అయి ఉండాలి. కీడెంచి మేలెంచాలి అంటారు కదా అనుకోవచ్చూ. కీడే జరుజుగు తుందేమో అనుకుంటూ  పనిచెయ్యకూడదు . కీడెంచడం అంటే మనం చేసే పనిలో ఉన్న కష్టం గురించి ఆలోచించడం , ఏదయినా నష్టం వస్తుందా, వస్తే దాన్ని ఎలా అధిగమించాలి అన్నది మటుకే ఆలోచించాలి.  మనకు మనం మనకు ఏం కావాలి , మనం ఏం చెయ్యాలి అన్న దాంట్లో క్లారిటీ ఉండాలి.
ఇపుడు అసలు విషయానికి వద్దాం .  మిడిల్ క్లాస్ వాళ్ళు మిడిల్ క్లాస్ గానే ఎందుకు ఉండిపోతున్నారు . కొన్ని కారణాలు డిస్కస్ చేద్దాం
1 . తల్లి, తండ్రి, ఇద్దరు పిల్లలు ఉన్న ఫామిలీ లో తండ్రి మటుకే సంపాదించడం , మిగిలిన వాళ్ళు అతని సంపాదన మీద ఆధార పడటం
2 . మిడిల్ క్లాస్ కాబట్టి తండ్రి నుండి లేదా పెద్దలనుండి అంటే తాత ముత్తాత ల నుండి ఆస్తి ఏమీ రాకపోవటం . కేవలం జీతం లేదా ఒకరి ఆదాయం మీదనే ఆధార పడటం.
3 . ఇంట్లో సంపాదించే వ్యక్తి కి వ్యసనాలు ఉండటం , వ్యసనాలకు అలవాటు పడటం. ఉదా. తాగుడు , పేకాట, ఏ రకమైన జూదం అయినా కూడా .
4 . ఎదుగుదలకు కావలసినంత చదువు (లేదా) స్కిల్ (లేదా ) సామర్థ్యము , అవగాహన లేక పోవటం కూడా దోహదపడతాయి .
5 . మారుతున్న కాలానికి అనుగుణం గా , మారుతున్న , డెవలప్ అవుతున్న టెక్నాలజీ కి అనుగుణంగా అతను మారక పోవటం , డెవలప్ అవకపోవటం .
                                                                                                      (ఇంకా ఉంది )


కామెంట్‌లు
Shyamkumar చెప్పారు…
అద్భుతం
Unknown చెప్పారు…
జీవిత సత్యము..
చక్కగా వాృశారు..
Unknown చెప్పారు…
చాలా మంచి విషయాలు చెప్పారు.రెండవ భాగం కోసం wait చేస్తున్నాను.