"నీ జ్ఞాపకం నాతోనే"1980(ధారావాహిక 18,వ,బాగం)"నాగమణి రావులపాటి "
 కుసుమ ఆలోచనలో పడింది పెద్దలు కుదిర్చిన
వివాహం చేసుకుంటేనే ఇన్ని మాటలు అంటున్నారు
రేపు నేను రాహుల్ ను చేసుకుని వెళ్ళిపోతే
ఏమనుకుంటారో ఏమో పాపం నావల్ల అమ్మా
వాళ్ళకు అప్రదిష్ట తెచ్చిన దానికి అవుతానేమో
ఇలా పరి పరి విధాల ఆలోచనలతో మనసు
బాధతో మూల్గింది
అంతలో రాహుల్ కనిపించాడు అంతే ఆలోచనలు
అన్నీ దూది పింజాలుగాఎగిరిపోగా అమ్మో ఒక్క
నిమిషంలో నామనసు ఎంత బాధకు గురి
అయింది  ఇలాంటి వారివల్లే ఎన్నో ప్రేమ కధలు
మరుగున పడి పోతున్నాయి అని మనసుకు
సమాధానం చెప్పుకుని ఎలాగైనా రాహుల్ తో
మాట్లాడాలి అని నార్ణయించుకుంది కుసుమ
మమతల కోవెలలో వెలిగే సిరివెన్నెల దీపంలాగా
 సూర్యుని లేత కిరణాలకు విరిసిన కమలం లాగా
అర విరిసిన మందార కుసుమంపై మెరిసే నీటి
బిందువు లాగా మానసవీణా పలకంపై మీటే
రసరమ్య గీతిక లాగా అందం సొంతం చేసుకున్న
కుసుమ  రాహుల్ కంటికి తారాకాంతి చంద్రికలా
తన ప్రణయ ప్రేమ దేవతను కను రెప్ప వేయక
పరిసరాలను మరిచి మురిసి పోతున్నాడు
పదే పదే కుసుమకు  కనులతో సైగలు
చేస్తున్నాడు కుసుమకు కంగారు పుడుతోంది
ఎక్కడ అమ్మా వాళ్ళు చూస్తారో అని తనూ
సైగ చేసి చెపుదామంటే కుదిరేట్టు లేదని
గమనించిన కుసుమ నన్ను చూసి తనెక్కడ
వున్నాడో మరిచి నన్ను పలకరించే టట్టు వున్నాడు కదా ఎలాగైనా  పక్కకు తీసుకెళ్ళాలి లేకపోతే
అమ్మా వాళ్ళకు అనుమానం రావటం ఖాయం
అనుకున్న కుసుమ  పెళ్ళి కూతురు గదికి వెళ్ళింది
అప్పటికే రాత్రి ఎనిమిది అయింది అందరూ పెళ్ళి
తిలకించే కార్య క్రమంలో వున్నారు ఏమి చేయాలి 
రాహుల్ ను ఎవరూ చూడకుండా ఎలా పలకరించాలి 
అని ఆలోచిస్తూంటే పెళ్ళికూతురు తల్లి అమ్మా
కుసుమా అక్కడ పెట్టిన బ్లాగ్ తీసుకు రామ్మా అని
పని పురమాయించారు కుసుమకు వుండండి
నేను తీసుకు వస్తాను అని రాహుల్ వెనుక నుంచి
వచ్చి కుసుమ చేతిలో బ్యాగ్ తాను తీసుకుని
వాళ్ళు నిర్దేశించిన జాగాలో పెట్టాడు రాహుల్ 
అది గమనించిన పెళ్ళికూతురు అమ్మగారు
అయ్యో బాబూ నీవు పెళ్ళికొడుకు వాళ్ళ తరపు
అబ్బాయివి నీతో మోయించటం భావ్యం కాదు
నీ మంచిమనసుకు ధన్యవాదాలు నాయనా
అని ప్రశంశలు వాన  కురిపిచింది
కుసుమ అమ్మా నాన్న  బంధువులు అందరూ పెళ్ళి
సందడిలో వున్నారు  కుసుమ రాహుల్ కు సైగ చేసింది బయటికి రమ్మని సరే అని రాహుల్ ముందు
వెళ్ళగా కుసుమ కాస్త వెనుకగా తానూ బయటికి
నడిచింది అక్కడ చాలా కార్లు గా వున్నాయి
మనుషులు లేని కార్లు సమూహం ఏదో మీటింగ్
పెట్టుకుంటున్నట్టు వాటిని చాటుగా చేసుకుని
రాహుల్ కుసుమను చేయి పట్టి లాగాడు
కుసుమ విడిపించుకుని మిమ్మల్ని రమ్మన్నది
రొమేన్స్ చేసుకోటానికి కాదు మీరు ఎక్కడ
నన్ను పలకరిస్తారో అని చూడండి ఈ పెళ్ళి
అయి మేము వెళ్ళేదాకా కాస్త ఒళ్ళు దగ్గర 
పెట్టుకుని మెలగండి మా అమ్మకు అనుమానం
వచ్చేలాగా ప్రవర్తిస్తున్నారు ఆవిడకు అనుమానం
వేస్తే ఇంకా రేపటినుండి కాలు కూడా బయటి
పెట్టే నీయదు మీరూ మీ వేషాలూ అని మెత్తగా
చీవాట్లు పెడుతుంటే నవ్వాగలేదు రాహుల్ కు
ఇది చెప్పటానికి ఇంతదూరం రావాలా అక్కడే
చెప్పొచ్చు కదా నాకు తెలుసులే ఈ విధంగా
నాన్ను కలుసుకోవాలనేగా ఈ రోజు నువ్వు
చాలా అందంగా వున్నావు కుసుమా ఇదే 
చెపుతున్నా నీకు సైగలతో అని అన్నాడు రాహుల్
ఆ సైగలు అలా చేస్తే అమ్మ చూడదా నన్ను
టెన్షన్ పెట్టటానికి కాకపోతేనూ అని అనగానే
సరే  బంగారం ఇంత అందంగా నీవు తయారైతే
నాలో ప్రేమికుడు ఊరు కుంటాడా అని అనగానే
మీరూ చాలా అందంగా వున్నారు అందుకే
ఎక్కువగా ఏమీ అనలేక పోతున్నా అని సిగ్గు
దొంతరలు నడుము చేతులతో ముఖాన్ని
దాచుకుంది ఇది పెళ్ళి హాలు కాబట్టి వదిలేస్తున్నా
లేకపోతే?,(సశేషం) తరువాత బాగం రేపే...!

కామెంట్‌లు