"నీ జ్ఞాపకం నాతోనే"1980(ధారావాహిక 19,వ,బాగం)- "నాగమణి రావులపాటి "
 సరే  ఇక పదండి లోపలికి  వెళ్దాం అని అన్నది కుసుమ ఎంత నిర్దయురాలివి కుసుమా ఇది
 చెప్పటానికా ఇక్కడికి రప్పించావు కాసేపు
వుండవచ్చు కదా అని  అన్నాడు రాహుల్
ఇదేమన్నా పార్క్ అనుకున్నారా పబ్లోక్ ప్లేస్
ఏదో అందరూ పెళ్ళి సందట్లో వున్నారు కదా అని
రమ్మన్నాను కాస్త చనువిస్తే చాలు ఎక్కడికో
వెళతారు అని అన్నది కుసుమ పార్క్ ఐతే
పరవాలేదా ఐతే దగ్గరలోనే వుంది పోదాం అని
అన్నాడు రాహుల్ నవ్వకుండా వుండలేక
పోయింది కుసుమ తోడు దొంగల్లా ఏమీ ఎరగనట్టు
ఒకరి తరువాత ఒకరు పెళ్ళి సందడిలో 
కలిసి పోయారు అని అనుకున్నారు కానీ రాహుల్
ఫ్రెండ్ కనిపెట్టేసాడు నెమ్మదిగా రాహుల్ భుజంపై
చేయివేసి ఊ ఎంత వరకూ వచ్చింది మీ ప్రేమ కధ
అని అనగానే ఓ చూసేసావా అని ఫ్రెండ్ తో
అన్నాడు రాహుల్...
నాకు వచ్చినప్పటినుండీ అనుమానం వేసింది
మీ ఇద్దరినీ ఓ కంట కనిపెడుతూనే వున్నాను
మీ దొంగ చూపులు కనుసైగలు తనకీ నీవంటే
ఇష్టమే అనుకుంటా అని అన్నాడు రాహుల్ ఫ్రండ్
ఇష్టం కాదురా ప్రాణం నేనంటే అని అనగానే ఔనా
లక్కీ ఫెలో విరా చక్కని అందమైన అమ్మాయి
నీజీవితంలోకి వచ్చింది అని అనగానే నిజమేరా
నాకు జాబ్ వచ్చిన విషయం నీకు తెలుసూ గా
ఇంకో ఐదు రోజుల్లో నేను విజయవాడ వెళతాను
ఏదో ఒక ప్లాన్ వేసి ఈ రాత్రికి కుసుమ  కూడా
ఇక్కడే వుండేటట్లు చేయరా మనతో పాటు తానూ వుంటే నాకు హేపీగా వుంటుంది అని అన్నాడు
రాహుల్ సరే ఆలోచిద్దాం అని అన్నాడు రాహుల్ 
ఫ్రెండ్  పెళ్ళికూతురు తలంబ్రాలు చీర
 కట్టుకోవాలని కి గదిలోకి వెళ్ళింది తనతో
కుసుమ కూడా లోపలికి వెళ్ళింది మెల్లగా
వీళ్ళు ప్రేమాయణం పెళ్ళికొడుకు చెవిలో ఊదాడు
రాహుల్ ఫ్రెండ్ వావ్ సూపర్ మనోడు మనకు
తెలియకుండా ఇంత తంతు నడుపు వున్నాడా
సరే ఏదో ఒకటి ఆలోచిద్దాం అని ఆలోచనలో
పడ్డారు ఫ్రండ్స్ ఇద్దరూ ...!!
పెళ్ళి తంతు ముగిసింది మెల్లగా వీళ్ళిద్దరి ప్రేమ
వ్యవహారం పెళ్ళి కూతురు చెవిలో పడేసాడు
పెళ్ళికొడుకు అంతే  నాకూ అనుమానం వచ్చింది
కానీ ఈ తింగరి బుచ్చి నాకు ఒక్క మాట కూడా
చెప్పలేదు మన పెళ్ళిలో వీళ్ళ ప్రేమ కూడా
పెళ్ళికి దారితీయాలి నాకు ఒక ఐడియా వచ్చింది
అప్పగింతలు అయ్యాక పెళ్ళికూతురుకి తోడుగా
ఎవరినైనా పంపుతారు కదా నాకు తోడుగా
రావటానికి కుసుమ ను పంపమని మాఅమ్మ తో
వాళ్ళు అమ్మకు చెప్పిస్తాను వాళ్ళు బోజనాలు
అనంతరం వాళ్ళు ఇంటికి వెళతారు కుసుమ
మనతో వుంటుంది అంది అది వస్తే నాకు బోర్
కొట్టదు అని అన్నది పెళ్ళి కూతురు...!!
గుడ్ ఐడియా డియర్ ఆపనిలో వుండు ఎలాగైనా
వాళ్ళు ప్రేమను గెలిపిద్దాం అని అన్నాడు
వరుడు కుసుమను పిలిచింది నవ వధువు
ఏమే కుసుమా మన వాళ్ళను ఒప్పిస్తాను నాతో
రావే అని అనగానే అమ్మో నేను రాను అమ్మ
పంపించదు నాకు భయం బాబూ నేను రాను
అని అనగానే అమ్మా తల్లీ ఇది నీ రాహుల్ కోరిక
అని అనగానే కంగు తిన్నది కుసుమ అంతగా
ఆలోచించకు మాకు తెలిసి పోయింది మీ ఇద్దరి
గురించి అని నవ్వుతూ అనేసరికి పక్కనే ఏమీ
ఎరగనట్టు ఎటో చూస్తూ రాహుల్ వంక చూసింది
ఆ క్షణంలో రాహుల్ దృష్టి ఇటు తిరిగి వుంటే
శివుని మూడో నేత్రానికి మన్మథుడు భస్మం
అయినట్టు అయ్యే వాడేమో దేవుడు కరుణించినట్టు
రాహుల్ అటెటో చూస్తూ కనిపించాడు
మామూలుగా అయితే  రాహుల్ అంత సాహసం
చేసేవాడు కాదు ఇక్కడ తనేమి అనదులే అనే 
దీమాతో వున్నాడు రాహుల్ నెమ్మదిగా కుసుమకు
ఆ ప్లాన్ నచ్చసాగింది ఇదంతా రాహుల్ స్కెచ్
దేన్నయినా సాదించుకుంటాడు ఏది చేసినా
తన మీద ప్రేమతోనే కదా నాకూ రాహుల్ తో
సరదాగా గడపాలనే వున్నది ఇంత చక్కని
అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి మళ్ళీ
ఇలాంటి అవకాశం ఇంకా రాదు అనుకుని
స్నేహితులితో వస్తానే మావాళ్ళనూ ఒప్పించే
బాధ్యత నీదే నే అని అనేసరికి ముసి ముసి గా
నవ్వింది నవ వధువు  ఇంతలో? (సశేషం)
తరువాత బాగం రేపే...!!

కామెంట్‌లు