"నీ జ్ఞాపకం నాతోనే "1980(ధారావాహిక 27,వ బాగం)"నాగమణి రావులపాటి "
 కాలం మనకోసం ఆగదు తనపని తాను చేసుకుంటూనే పోతుంది  కాలంతో మనమూ
కదులుతూ మన పనులను మనమే చక్కబెట్టాలి
కుసుమ మంచో చెడో తనకు తోచిన విధంగా
తను నిర్ణయాలు తీసుకుని తనకు తోచిన విధంగా 
కొత్త జీవితానికి దారులు వేస్తూ బ్రతుకు సమరం
సాగిస్తోంది ...........!!
ఇక్కడ రాహుల్ గురించి తెలుసుకోవాలి కుసుమ
తన స్వార్థం తాను చూసుకుని తన వాళ్ళకు
న్యాయం చేయటం కోసం ప్రాణానికి ప్రాణంగా 
ప్రేమించిన రాహుల్ ని అర్ధాంతరంగా ఒంటరి
వాడిని చేసి అందంగా కట్టుకున్న ప్రేమ సౌధాన్ని
సునాయాసంగా కూల్చివేసి ప్రేమ అనే పదాన్ని
కాల్చి బూడిద చేసి ఆ బూడిదను కూడా మిగల్చక
గాలిలో నీటిలో కలిపేసి వెళ్ళిపోయింది.....!!
గీత ఊరు వెళ్ళింది ఖనీసం వాళ్ళు అమ్మా నాన్నలతో
కూడా ఒక్క మాట చెప్పలేదు గణేష్ కు చిన్న
మెసేజ్ కూడా తెలుపలేదు కర్మకాలిగణేష్ ఆరోజు 
బిజినెస్ పనిమీద హైదరాబాద్ వెళ్ళిల్సి వచ్చింది
రెండు రోజులవరకూ రావటానికి కుదరలేదు
కుసుమ వదిన వచ్చి తాను ఊరిలో లేనని 
కలులవటానికి రాలేదు అనుకున్నాడు కానీ
కుసుమ ఇంత బాధలో వుందని తనకు తెలియదు..!
వారం తరువాత కుసుమ ఎలావుంటుందో ఏమో
కలిసి వద్దాం అని అనుకుని కుసుమ ఇంటికి
వెళ్ళాడు తాళం వేసి వుండటం గమనించి ఎక్కడికైనా పెళ్ళికో పేరంటానికో వెళ్ళారేమో
అనుకుని ఒకసారి ఇంటి ఓనర్స్ తో కలిసి వీళ్ళ
గురించి అడిగాడు ఇంకెక్కడి వాళ్ళు  బాబూ
మీకు తెలియదా మాస్టారుగారు ఆయన బార్యా
రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయారుగా పాపం ఆ
ముగ్గురు పిల్లలూ వాళ్ళు సొంతూరుకు వెళ్ళి
పోయారట వాళ్ళు బంధువులు వచ్చి ఇల్లు ఖాళీ చేసి
‌సామానులు తీసుకు వెళ్ళారు రెండు రోజులక్రితమే
అని చెప్పే సరికి గణేష్ కళ్ళు తిరిగి కింద పడేంత
వాడై తమాయించుకుని ఏఊరు వెళ్ళారు
ఏమన్నా చెప్పారా అని అడిగాడు వాళ్ళని 
ఏమో బాబూ వాళ్ళు అనటం విశాఖ పట్టణం
అని అన్నట్టు గుర్తు కరెక్ట్ గా మాకూ తెలియదు
అని అనేసరికి భూమి ఒకేసారి గుండ్రంగా
తిరిగినటై అన్నయ్యకు ఏమి సమాధానం చెప్పాలి
అని రకరకాల ఆలోచనలు చుట్టుముట్టి వెంటనే
విజయవాడ లో వుండే రాహుల్ ఫ్రెండ్ కు 
సమాచారం పంపాడు నెమ్మదిగా రాహుల్ కు
ఈ విషయం తెలుపమని?(సశేషం)......!!

కామెంట్‌లు