"నీ జ్జాపకం నాతోనే "1980(ధారావాహిక 35,వ,బాగం)"నాగమణి రావులపాటి "
 బాబాయికి వీలు కాక పోయేసరికి  కుసుమ  లోన్
డబ్బులు కట్టటానికి బ్యాంకుకు వెళ్ళింది  అక్కడ
కౌంటర్లో మనీ పే చేసింది ఆ పేపర్స్ అటు చివరగా
వున్న కౌంటర్ కు వెళ్ళాయి అక్కడ కట్టినట్టు రసీదు
తీసుకోవాలి అటుగా అడుగులు వేసింది కుసుమ
అక్కడ కౌంటర్ లో వున్న వ్యక్తిని చూసి కంగుతిన్నది
ఆవ్యక్తి తలవంచుకుని వున్నాడు తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు అతనిని చూస్తే అచ్చం
రాహుల్ లాగానే వున్నాడు కానీ గడ్డం వున్నది
రాహుల్ చాలా అందగాడు ఎప్పుడూ ఇన్సర్ట్
వేసుకుని నీట్ గా తయిరయ్యేవాడు ఇతనూ నీట్
గానే తయారయ్యాడు కానీ గడ్డం పెంచాడు
ఇంతలో కట్టినట్టు రసీదు  తల ఎత్తకుండానే కౌంటర్ 
బయట వుంచాడు ఆ చేతిని చూసింది అంతే
తను ప్రాణం తన కళ్ళముందే ఆవిష్క్రుతం 
అయ్యేసరికి ఒక్క క్షణం స్దబ్దతగా మారింది ఆ చేతికి
వున్న కే అనే ఉంగరం తనకు సుపరిచితం తనమీద
ప్రేమతో రాహుల్ చేయించి పెట్టుకున్న తీపి గురుతు
అంతే ఒకసారిగాపక్కకు తిరిగింది కొంచెం దూరంగా
నడిచి తలతిప్పి బుజం మీదనుండి పరికించింది
రాహుల్ పనిలో లీనం అయ్యాడు కుసుమ
హృదయం ఆనందంతో ఆశ్చర్యంతో అనురాగంతో
ప్రేమ నిండిన కనులకు ఆనందం భాష్పాలు
అడ్డు రాగా కనులు తుడుచుకుని ముందుకు
నడిచింది ఇంతలో వెనుక నుంచి కుసుమ.గారూ
అనే మాట వినిపించింది ఒక్క క్షణం ఆగి మళ్ళీ
నడక వేగం పెంచింది అలా పిలవడానికి కారణం
తను చేతి రుమాలు పెన్ అక్కడే మరిచిపోయింది...!
ఇక్కడ రాహుల్ కుసుమ అనే మాట చెవిని 
పడగానే కుసుమ ఎవరు అని అడిగాడు ఇప్పుడు
అమౌంట్ కట్టటానికి వఛ్ఛిఃదే ఆవిడ అని అన్నాడు 
కుసుమను  పిలిచినా సహా ఉద్యోగి  అలాగా ఆమె
ముఖం నేను చూడలేదు ఎక్కడ వుంటారు ఏమీ
చేస్తారు ఆమె అని అడిగాడు రాహుల్ ఆమె జిరాక్స్
మిషన్ మరియు టైలరింగ్ చేస్తుంది దానికోసమే లోన్
కడుతుంది అని చెప్పాడు రాహుల్ ఆలోచనలో
పడ్డాడు తను నా కుసుమేనా తాను వైజాగ్ అని
చెప్పొరట కదా వాళ్ళు బంధువులు నాకుసుమే అయితే నన్ను చూసి పలకరించకుండా ఎలా
వుండ గలదు అయినా ఈ కుసుమా వాళ్ళది జిరాక్స్
మిషన్ టైలరింగ్  కుసుమ కు ఇవేవీ తెలియవు
తను కాదులే అని కుసుమ తలపుల తలబోతలో
రూమ్ వైపు నఢిచాడు రాహూల్? (సశేషం)

కామెంట్‌లు