"నీ జ్జాపకం నాతోనే"1980(ధారావాహిక 42,వ,బాగం")- "నాగమణి రావులపాటి "
 కాఫీ షాప్ లోకి అడుగు పెట్టాడు రాహుల్ 
అక్కడ ఒక వర్కర్ కాఫీ పొడి తూకం వేసి
ఫేక్ చేస్తున్నాడు తల ఎత్తి రాహుల్ కేసి చూసి
చెప్పండి సార్  అన్నాడు మీ ఓనర్ గారితో పని
వుండి వచ్చాను అని అన్నాడు రాహుల్.........
ఓ కుసుమా మేడమా ఇప్పుడే వెళ్ళారు ఏదో పని
వుందట వెళ్ళారు అంత అవసరమని పిస్తే
పక్క షాపులో అడగండి వాళ్ళు తమ్ముడు
వైభవ్ వున్నారు అని అన్నాడతను పర్వాలేదులే
నేనే స్వయంగా కలుస్తాను మళ్ళీ వస్తాను అని
అన్నాడు రాహుల్...............!!
కాలం చేసే కనికట్టు లో ఎన్నో వింతలు మరెన్నో
వినోదాలు రాహుల్ ను చూసిన సంబరంలో
మనసులో శోకాలన్నీ మబ్బులు వీడిన వెన్నెలైతే
ఆ మబ్బులన్నీ ఒకటిగా చేరి  చీకటి తెరలా
బ్రతుకు బాటలో విలన్ పాత్ర ధరించాయా అన్నట్టు
ఒక రెండు కళ్ళు తనని క్రూరంగా వెంటాడు
తున్నాయని పాపం కుసుమకు తెలియదు..........!!
ఆ క్రూర మృగం కుసుమను కాటెయ్యాలని మాటు
వేసిందని గమనించలేదు తమ్ముడు చెల్లి వాళ్ళ
అభ్యున్నతే తన ద్వేయం  వాళ్ళకోసం అన్నీ తానై
చూసుకోవటం ఇదే లోకంగా నిత్య కృత్యం లో
తనచుట్టూ చూసుకోలేక పోయింది ......‌..‌.....!!
ఎంతైనా తానూ ఒక ఆడపిల్ల అందానికి చిరునామా
పెద్ద దిక్కు లేని సంసారం వేటగాళ్ళ ఆటల వలలో
అలుసుగా పంటకాయ పలహారంలో పావులా
కనిపించింది సమయం కోసం కాపు కాసింది.......!!
ఎన్నో ఆలోచనలు మదిని మురిపించగా ఇల్లు చేరిన
రాహుల్ మనసు గాలిలో విన్యాసాలు చేస్తోంది ...
తలపుల తపనలు చేసే తాటాకు చప్పుళ్ళు
ఆగిపోయాయి గుడిలో గంటలు మదిలో మ్రోగాయి...
విరహాలన్నీ ఇంద్రధనుస్సులై ముచ్చటగొలుపుచూ
మనసు ఆనంద పారవశ్యంలో విహరిస్తోంది....‌..!!
ఓం మై గాడ్ కుసుమా చూసావా దేవుడు నామొర
ఆలకించాడు ఈవిధి విలాసం నాకు చెప్పకుండా నీవు
ఇక్కడికి రావటం ఏమిటి ఈ బ్యాంకు లోనే లోను తీసుకోవటం ఏమిటి నాకు ఇక్కడికే బదిలీ
కావటం ఏమిటి  ఆరోజు నిన్ను చూడకుండానే
వున్నా నిన్ను అతను పిలవటం నీకోసం నా అన్వేషణ
ఫలించింది బంగారం ఈరోజు నా హృదయం
ఆనందంతో నింపేశావు...........!!
రాహుల్ మనసు పరవశాల తటాకంలో ఈదులాట
కుసుమ మనసు మల్లెపూలతో విరిసిన పూలతోట
ఇద్దరి చూపుల కలయికకై ప్రకృతి ఆడే వింతాట
ఈ పూట "నీతోనే నాజ్జాపకం" కథకు పలుకుతానంట
సశేషం సశేషం అని ........................!!

కామెంట్‌లు