రాహుల్ కుసుమల ప్రేమ గోదారమ్మ వరదలా.
గలగల పారే శలయేటి పరుగులా వసంతంలో
మావి చిగురు గుబురులో దాగి కూహూ కుహూ
సుస్వర కోకిల గాన మాధుర్యంలా..! విరిసిన
మల్లెలు సువాసనా భరిత సుగంధ మాలికలా..!
చిరు చిరు జల్లులతో తడిసిన నేలపై పరవశించి
ఆడే మయూర నాట్యంలా, అర విరిసిన మందార
మకరందం పై వాలే తుమ్మెద ఝుంకారంలా..!
చల్లని పల్లవ వీచికలతో మురిసి పక్షులు చేసే
కిచకిచ రావాల సవ్వడిలా .!అందమైన ప్రకృతి
పైటకొంగు రెపరెపలా, ప్రేమ ప్రయాణం సాగే వేళ
కుసుమ రాహుల్ తో ..!రేపు మిమ్మల్ని
కలవలేను అని చెప్పేసరికి ఎందుకు అని
ఆత్రుతగా అడిగాడు రాహుల్..!
రేపు నాకు టైప్ ఎగ్జామ్ వున్నది సాయంత్రం
అమ్మా వాళ్ళతో కలిసి మాచుట్టల ఇంట్లో
పెళ్ళికి వెళుతున్నా అందుకే .!మళ్ళీ ముందురోజే కలుస్తాను అని అన్నది..! తప్పదా నీవూ వెళ్ళాలా
అని ఉసూరు మన్నాడు రాహుల్..! తప్పదు
అమ్మా వాళ్ళతో కలిసి వెళ్ళాల్సిందే లేకపోతే
నాన్నగారు ఊరుకోరు అని అన్నది కుసుమ..!
సరే ఏం చేస్తాం దేవీగారి ఆజ్ఞ పాటించక తప్పదుగా
అని నిష్టూరంగా అనేసరికి ..!
గలగలా నవ్వింది కుసుమ గోదారిపొంగులా..!
అది ఒక ఫంక్షన్ హాలు పెళ్ళికి వచ్చిన బంధువులతో
హాలు సందడి సందడిగా వున్నది..! కుసుమ
అసలే తెల్లగా అందంగా వుంటుంది .!రాణీ పింక్
పట్టు పరికిణీకి ..!ఆకుపచ్చ బార్డర్ తో అద్దాలు
కుట్టిన పింక్ కలర్ జాకెట్..!ఆకుపచ్చ ఓణీ
వేసుకుని తలంటి పోసుకున్న కురులను
గాలికి వదిలేసి ,సీతాకోక చిలుక లాంటి
తెల్లరాళ్ళ క్లిప్ పెట్టి..!మెడలో చిన్న లాకెట్
వున్న సింపుల్ చైన్ వేసుకుని, పక్కకు కనిపిచేలా
ఎర్ర గులాబీ తో కుసుమ దేవకన్యలా వుంది..
సాయంత్రం కావటాన విద్యుత్ కాంతిలో!
దగదగా మెరిసిపోయింది అందరి దృష్టి
కుసుమపైనే నిలిచాయి..!
కావాలని కల్పించుకుని ఆరాటంగా ఆప్యాయంగా
పలకరించే బంధువుల పలకరింపులతో..!
పెళ్ళికూతురు వుండే గదిలోకి వెళ్ళింది..!
ఆ పెళ్ళి కూతురు బంధువులు అమ్మాయి
తనకు స్నేహితురాలు కావటాన వెళ్ళి తనని
పలకరించింది..! అబ్బా కుసుమా ఎంత
బాగున్నావే తెలియని వాళ్ళు నువ్వే పెళ్ళి
కూతురు అనుకుంటారు అంత అందంగా
వున్నావు అని అన్నది..! కుసుమ నవ్వి సరేనే
నేను హాలులో అమ్మా వాళ్ళు దగ్గర కూర్ఛుంటాను
అని శుభాకాంక్షలు చెప్పి బయటికి వచ్చింది..!
ఇంతలో? (సశేషం)తరువాత బాగం రేపే..!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి