"నీజ్జాపకం నాతోనే "1980(ధారావాహిక,21,వ భాగం)- "నాగమణి రావులపాటి "
పెళ్ళి పల్లకిలో పెళ్ళికూతురు పెళ్ళికొడుకూ
ఆశల ఊహలను రెక్కలు గా చేసుకుని 
ఆనందాల సరాగాల లో తేలిపోతూ వుంటే
ప్రేమ సాగరంలో మునిగి తేలుతూ ప్రణయ
అలలపై విహరిస్తూ అనురాగాలు చిలుకు తున్నారు
రాహుల్ కుసుమలు ఇంతలో రాహుల్ నీకోరిక
నెరవేరిందిగా ఎంజాయ్ కానీ ముందు మేము
వున్నామని మరిచిపోకురా బాబూ అని అన్నాడు
రాహుల్ ఫ్రెండ్ ..! మౌనంగా షేక్ హేండ్ ఇచ్చింది
కుసుమ ఫ్రెండ్ ..! పెళ్ళి జంట సరిగమలు ప్రేమ జంట
పదనిసలు ఒకేపడవలో ఏక తాళమై రాగాలు
పలుకుతూ సాగిపోతోంది వలపు విహంగమై..!

రాహుల్ కుసుమల ఆనందానికి అవధులు లేవు
కుసుమకు దగ్గరగా జరిగాడు రాహుల్  కుసుమ
చేతిని ప్రేమగా తన చేతిలోకి తీసుకున్నాడు
మురిసి పోయింది కుసుమ ఇంతలో సుతి మెత్తగా
ఆమె బుగ్గపై ముద్దు పెట్టాడు రాహుల్ ..!అంతే
చివాలున తన చేతిని లాగేసుకుంది ఇలా చేస్తే
నేను కారు దిగి పోతా అన్నది, సత్యభామలా
ముఖం పెట్టి ..!ఏం ఇక్కడ వీళ్ళు చూస్తరనా
పదా నేనూ వస్తా ఇద్దరం చీకటిలో నడుచుకుంటూ
ముద్దులు కౌగిలింతలూ ఓహొ ఎవరూ చూడరు
ఇద్దరమే మనిద్దరమే అని పాటలు పాడుకుంటూ
వెళదాము సరేనా అని అన్నాడు చిలిపిగా...!

ఇదిగోండి ఇలా చేస్తే నేనూరుకోను  అని అన్నది
కుసుమ ఔనా ఏంచేస్తావేమిటి నన్ను నమిలి
మింగేస్తావా..! దొరక్క దొరక్క దొరికిన అవకాశం
నీవెలాగూ బయట పడవు నా చిన్న చిన్న కోరికలు
తీర్చుకోనీవే అని అన్నాడు రాహుల్  మీరు మీ
హద్దు మీరు తున్నారు అని అన్నది కుసుమ
మీరేం సెలవీయండి హద్దు లోపల ఏమిటో హద్దు
మీరుట మేమిటో అని అన్నాడు రాహుల్ చలోక్తిగా
అమ్మో నన్ను ఇరికించి తమాషా చేస్తున్నాడు
నాకు రాహుల్ తో ఎన్నో మాట్లాడాలని వుందని అతను చేసే చిలిపి చేష్టలకు మురిసి పోతున్నానని 
చెపితే రెచ్చిపోడు నాకు రాహుల్ అంటే ఇష్టం
ఆ ఇష్టంతో నే కదా తనతో ప్రయాణం చేయటానికి 
ఒప్పుకుంది అని మనసులో అనుకుంది కుసుమ..!

హలో అమ్మాయిగారు నేను అంత కక్కూర్తి వాడిని
కానని మీకు తెలుసు ఏదో దేవుడు దయ తలిచి
ఒక చిన్న అవకాశం ఇచ్చాడు  అలాంటి వాడినైత మన ప్రేమ ఇంతదూరం రానిచ్చేదానివా
ఎందుకే నా దగ్గరా నీ మొహమాటం మిమ్మల్నే
వింటున్నారా నేను  ఇంకో నాలుగు రోజుల్లో
వెళ్ళిపోతాను మళ్ళీ నెలరోజులదాకా రాను 
నువ్వు హాయిగా వుండొచ్చు నిన్ను పెళ్ళి చేసుకుని 
శాశ్వతంగా నాదానిని చేసుకుంటాను ఈ నెలరోజులు 
నాకు నరకమే కదా అందుకే కాస్త నాతో సరదాగా
వుండవచ్చు కదా తరువాత నా పరిస్తితి ఏమిటో
దేవుడా నన్ను ఈ కుసుమ భారీ నుండి నీవే కాపాడు
అని అన్నాడు రాహుల్...!

అంతే కుసుమ ఇవేవీ వినిపించుకోలేదు నేను
నాలుగు రోజుల్లో వెళతాను మళ్ళీ నెల రోజులు దాకా 
రానుఅనే రాహుల్ మాటలే గుర్తున్నాయి ఒక్కసారిగా
హృదయంలోబాధా విరహం  గంగా గోదావరీ నదులు ఉప్పొంగి వలవలా ఏడుస్తూ రాహుల్ ను గట్టిగా
చుట్టేసింది ఈ హఠాత్పరిణామానికి విస్తుపోవటం
తనవంతు అయింది రాహుల్ కు

ముందు సీటులో కూర్చుని చక్కని పాటలను 
ఆస్వాదిస్తూ వున్న పెళ్ళి జంటకు వినిపించి
 ఏమయిందిరా అని అడిగాడు రాహుల్ ను
ఏమీ లేదులే రా నేను నెలరోజులు తనను విడిచి
వెళతాను అన్నాను అమ్మగారికి విరహ వేదన
కలిగిందనుకుంటా అని అన్నాడు రాహుల్ 
ఒరే నీకు బుద్ది వున్నదా అలా చెప్పి కుసుమ ను
ఏడిపిస్తావా సమయం సందర్భం తెలియదా
ఏం కాదు కుసుమ గారు మేమంతా మీకు తోడుగా
వుంటాము ఈ వెధవ మాటలు పట్టించు కోకండి
అని కుసుమ ను అనునయించాడు రాహుల్ ఫ్రెండ్
ఊ అందరూ నన్నే అనండి  అని సరదాగా 
అనేసరికి అందరూ నవ్వుకున్నారు కుసుమ ఇంకా
రాహుల్ ను అలాగే చుట్టుకుని వుంది అని చూసి
రాహుల్ అమ్మో అందరూ చూస్తారు మీరిలా
చేయటం పద్దతేవా అని అనేసరికి ఏమీ కాదు
చూస్తే చూడనీయండి  నాకేమిటి నా రాహుల్ నాకే
సొంతం అని గారాలు పోయింది అనురాగం
ఆత్మీయత ప్రేమ మేళవించిన శుభ సమయాన
రాహుల్ కుసుమలు ఒకరిలో ఒకరు ఒదిగి పోయి
ప్రణయపు అలలపై  మధుర స్వప్న లోకంలో
విహార యాత్ర సాగించారు? (సశేషం).....!
తరువాత బాగం రేపే...!

కామెంట్‌లు