నిరంతరం ప్రేరణ ;-పోతుల చైతన్య భారతి హైదరాబాదు 7013264464
గొప్ప ధారణ శక్తికి  
ధరణిలో లేదు సాటి 
సత్ప్రవర్తనతో నుంటే 
జీవితం గెలుపు కాదేంటి?

అపజయాలు శిక్షణగా 
సిగ్గుపడక స్వీకరించు 
నిత్య సాధనతో నుంటూ 
విజయదుందుభి మోగించు

కచ్చితమైన దినచర్య 
తిరుగు లేని మలుపు 
బాల్యమందే చేపట్టి 
శిఖరాయమానమై నిలుపు 

సద్భావన సంకల్పం సరిపోదు 
నిత్యసాధనతోనే సాకారం 
సద్గ్రంథాల అధ్యయనం
అనుభూతుల ప్రాకారం 

పరిశీలన లేని చదువులు 
జ్ఞానాన్ని నింపలేవు 
పట్టుదల ఉన్నట్లయితే 
ప్రతిబంధకాలు నిలువవు 

ప్రేరణతో నిరంతరం 
భావాలకు అభ్యుదయం 
సంస్కరణలతో శ్రీకారం 
భవితకదే నవోదయం.

కరువు లేదు వనరులకు 
సంచలనాలకు తెరలేపు 
ఆటంకాలకధైర్యమెందుకు 
నీ సత్తువ ఏంటో చూపు 


కామెంట్‌లు