మణిపూసలు ;-పి. చైతన్య భారతి (చైతన్య ))7013264464
 1.
మండుతున్న ఎండలు 
ఎండుతున్న గొంతులు 
వానమ్మా వచ్చిపోవే 
నిలబెట్టు  ప్రాణాలు 
2.
ఆకాశం ఉరిమెనులే 
నేలమ్మా నవ్వెనులే 
ఆశలన్ని ఉప్పొంగుతు
మనసువీణ మోగెనులే. 
3.
అందమంత ఒకేచోట 
సమ్మోహన పరిచేనిచట 
స్వర్గమంటె ఇదేనేమొ 
అరుణోదయ కాంతులిచట 
4.
సంతోషం సొంతమైతె 
విహంగమై ఎగిరిపోతె 
జీవితమే పూలవాన 
అందరము ఒకటి యైతె  

కామెంట్‌లు