అంతరంగం..;-ప్రమోద్ ఆవంచ- 7013272452

 లోపలేదో దాగుంది,అది చలనం లేకుండా
వుంటుందా?
అది అక్షరమే కావచ్చు,వాక్యమే కావచ్చు
చలనమై జ్వలించనూ వచ్చు
అది మనసును కదిలించనూ వచ్చు!
ఒక్కొక్కసారి మస్తిష్క వేర్లను కన్నీటితో 
తడపనూ వచ్చు.
ఎప్పుడూ ఊహల్లో అంతరంగం ఊగిసలాడుతూనే
ఉంటుంది‌.
కలలు నుంచి ఏం నేర్చుకుంటాం?
కళ్ళు తెరిస్తే అంతమవడం తప్ప!
జ్ఞాపకమనే ఏవో కొన్ని శబ్దాలు, మరిన్ని రంగులు
తడుమడుతూనే వుంటాయి.
వాటిని వెతుక్కుంటూనే వుంటాం.
కొన్ని సందర్భాలు జీవిత పాఠాలను నేర్పిస్తాయి.
ఇంక్కొన్ని సందర్బాలు జీవితాంతం అర్థం కాకుండానే
వుంటాయి.
చుట్టూ వెలుగున్నట్లే వుంటుంది, మనుషులంతా 
ఇలాగే వుంటారనిపిస్తుంది.
ఉన్నట్లుండి వాళ్ళ మాటల్లో తలకట్టో, దీర్ఘమో,ఏత్వమో, తలకిందులు అవుతాయి.
అర్థాలు మారినంత సులభంగా నాలుక కూడా మడతబడుతూనే వుంటుంది.
తెల్లవారుతుంది, వెలుగంతా మసకబారుతుంది.
పొగమంచు చుట్టూ కమ్ముకుంటుంది.
ఏదో మంద వెంట తీసుకొచ్చే దుమ్ము ధూళి 
నిన్ను ప్రశ్నిస్తుంది‌.
మళ్ళీ నిరంతర ప్రయాణం వెలుగు దారుల్లోకి..
తొవ్వుతున్నాను లోతుల్లో, ఇంకా అర్థం కాని 
విషయమేదో ఒక సంతకమై ఆజ్ఞాపిస్తుంది 
అంతు చిక్కని విలువలేవో ఆభరణాలై నీకు
తోడొస్తాయనీ!
కనిపించేదంతా నిజమేననుకున్నాను
వినిపించనంత దూరం వెళ్ళిపోయాను
విలువలకు ఒలువలు వదిలేసిన  జీవితాలు
నాలుగు కూడలుల దారుల్లో అనేకం!
                                   
కామెంట్‌లు