*నారదముని శివ క్షేత్రాలను, తీర్ధాలను దర్శించుకోవడం - శివ పార్షదులకు శాప విమోచనము - బ్రహ్మ లోకమలో బ్రహ్మ తో శివతత్వమును గురించి ప్రశ్నించుట!*
*మునీశ్వరుడైన నారదముని నుండి తమ శాప విమోచన మార్గం తెలుసుకున్న శివ పార్షదులు పరమేశ్వరుని మీద మనసు లగ్నము చేసి తమబలోకానికి బయలుదేరుతారు.*
*ఆ తరువాత మౌనులలో ఉత్తముడైన నారదుడు తాను ప్రారంభించిన శివ తీర్థ దర్శనానికి పునః ఉద్యుక్తుడు ఔతాడు. శివుని ధ్యానిస్తూ, శివ క్షేత్రాలను చూస్తూ పదే పదే భూమండలం అంతా కలయ తిరుగుతున్నాడు. ఆ విధంగా అన్ని శివ క్షేత్రాలను చూసిన తరువాత తుట్టతుదకు అన్ని శివ స్థానముల కంటే గొప్పది, మహాశివునకు ఎంతో ప్రీతిని చేకూర్చే కాశీ పట్టణాన్ని చేరుకుంటాడు. ఈ ప్రదేశము శివ స్వరూపిణి. కాశీనగరమును దర్శంచిన నారదడు పారలౌకిక ఆనందమును పొందుతూ మైమరచి పోతున్నాడు. కాశీ క్షేత్రంలో అడుగు పెట్టినప్పటి నుండీ, మహదానందమును అనుభవిస్తూ ఆ ముని శ్రేష్టుడు "కృతార్ధుడను అయ్యాను. నా పాతకముల కట్ట మహాదేవుని అనుగ్రహం తో కరగిపోయింది. శివ నామము అనే అగ్ని జ్వాలలో బడి కాలి బూడిద అయిపోయాయి" అని, శివుని మీద అలవిమాలిన ప్రేమ ఆదరము కలిగి ఆనంద సందోహాలలో తెలియాడుతున్నాడు. శివ పరిష్వంగన భావాన్ని సొంతం చేసుకున్న నారదముని, కాశీ పట్టణ మాహాత్యాన్ని కొనియాడుతూ, ఎన్నో సార్లు నమస్కరిస్తూ, ఎంతో మహిమాన్వితమైన ఆ క్షేత్రాన్ని వీడలేక పోతున్నాడు. కానీ, తనకు తెలిసిన, అనుభవానికి వచ్చిన శివ ధ్యాన ఫలం కంటే ఇంకా తెలుసుకోవలసిన విషయం వుంది అని స్ఫురణకు వచ్చి తన తండ్రి గారైన బ్రహ్మ దగ్గరకు, బ్రహ్మ లోకానికి పయనం మొదలు పెట్టాడు.*
*ప్రతీ క్షణము శివ నామ జపము, మనసులో అను క్షణమూ శివ రూపాన్ని నిలుపుకోవడము వల్ల, నారదముని బుద్ధి చాలా పవిత్రము గా అయ్యింది. ఇంత పవిత్తతను సొంతం చేసుకున్న నారదుడు శివతత్వ విశేష జ్ఞానము తెలుసుకోవాలి అనే కోరికతో తనతండ్రి బ్రహ్మ దేవుని సాదరంగా ప్రణతులు చేసి, అనేక విధములుగా కీర్తించి తన మనసులోని కోరికను ఈ విధంగా తెలుపుతాడు, మన నారదముని.*
*మహాశివుని యందు సంపూర్ణ భక్తి భావుమును కలిగిన మనసుతో నారదుడు, "తండ్రి! నీవు సర్వజ్ఞుడవు. జగములు అన్నటికీ తండ్రివి. మీ కృప నా యందు వుండటము వల్ల విష్ణు దేవుని మహాత్మ్యము ను తెలుసుకున్నాను. ఎంతో కష్ట సాధ్యమైన తపోమార్గము, జ్ఞాన మార్గము, భక్తి మార్గము, దాన మార్గములను శివ క్షేత్రాల దర్శనం వల్ల తెలుసుకో గలిగాను."*
*" నాకు శివ పూజా విధానము తెలియదు. శివ తత్వ జ్ఞానము బోధపడలేదు. కనుక, తండ్రీ! మీరు వివిధములైన శివ భగవానుని చరిత్రలను, వాటి స్వరూప తత్వమునూ, ఆ స్వామి పుట్టుకనూ, శివ కళ్యాణమును అన్ని విషయాలను నాకు చెప్పి నన్ను ఉద్దరించు. కార్తికేయుని పుట్టుక కథను కూడా నాకు తెలియజేయండి. మీకన్నాబీ విషయాలను సవివరంగా చెప్పగల వారు వేరెవ్వరూ లేరు. నా మీద మీద వ్న్న పుత్ర వాత్సల్యం తో ఈ విషయాలు అన్నీ సవివరంగా తెలుపండి" అని ప్రాధయ పడ్డాడు, నారదముని.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి