దత్తపది:-;-మమత ఐలకరీంనగర్9247593432
 ప.క్ష.పా.తం పాదాదిలో
తే.గీ
పలువురిన్ జూసి నేర్చెడి ప్రజ్ఞ ఘనత
క్షమను కురిపించు మనుజులే  ఛత్రపతులు
పాత్రధారులై జీవులు పాట్లు బడుచు
తండ్రి నీశ్వరున్ వేడేరు దారి నెంచి
తే.గీ
పరమ భక్తుడై వేడంగ వరము నొసగ
క్షణము లోవచ్చి బాలుని ప్రణతి గాంచి
పాల సంద్రాన్ని నిర్మించె పరమ శివుడు
తండ్రి యని వేడ భక్తుని తపన దీర్చ

కామెంట్‌లు