చిత్రానికి పద్యాలు;-మమత ఐలకరీంనగర్9247593543
 క.
ఎండకు దప్పిక గొనిచున్
బండలనెన్నిటినొతెచ్చి పానియమునకై
కుండను నింపిన పక్షికి
మెండగు వడదెబ్బ తగిలి మిన్నుకు ముట్టెన్
క.
మండే యెండల గుళికలు
దండిగనే తెచ్చి నింపె దాహము వేయన్
నిండిన బిందెకు పక్కన
గండము వాటిల్లి కూలె గరుడిక నయ్యో!


కామెంట్‌లు