స్థాన బలం;-ఏ.బి ఆనంద్,-ఆకాశవాణి.94928 11322

 ఇవాళ ఏ పల్లెకు వెళ్ళినా  రెండు వర్గాల వారు ఎప్పుడు  పోట్లాడుకుంటూనే ఉంటారు. ఎవరో ఒకరే కదా గెలిచేది. వారు ఆధిపత్యం వహిస్తారు ఓడిపోయిన వాడు ఊరుకోకుండా  మళ్లీ కొంతమందిని తయారు చేసుకుని తన ఆధిపత్యం కోసం ప్రయత్నం చేస్తాడు. ఓడినా మళ్ళీ ప్రయత్నం చేస్తాడు అలా గెలిచే వరకు  చేస్తూనే ఉంటాడు చివరకు విజయాన్ని సాధిస్తాడు. మళ్లీ ఆ ఓడిన అతను ఇదే పద్ధతి  పల్లెల్లో జరిగే సాధారణ ఉదాహరణ. వారిలో ఒకరు  వేరే ప్రాంతానికి వెళ్లి  పిల్లల చదువు కోసమో, వ్యాపారం కోసమో మరే కారణంగానో  అక్కడ నివాసం ఏర్పరచుకుని  జీవిస్తూ ఉంటే  అతనిని పట్టించుకునే వారు ఎవరైనా ఉంటారా ? ఏదైనా తగాదా వచ్చినప్పుడు  ఇతను ఎవరో కూడా తెలియదు కదా ఇతని  ప్రక్కకు ఎవరు వస్తారు కనుక ఓటమి తధ్యం. దీనికి యోగివేమన అద్భుతమైన ఉదాహరణ ఇస్తాడు. మనం చూస్తే మొసలి నీటిలో ఉన్నంతవరకు దాని బలం ఎంతో దానికి తెలియదు  ఆ మడుగులో నీళ్ళు తాగడానికి వచ్చిన ఏనుగును కూడా  పట్టి బంధిస్తుంది. ఆ మడుగు దాటి  దురాశతోనో,  పేరాశతోనో  బయటకు వచ్చి వీరవిహారం చేస్తున్న సమయంలో  చిన్న కుక్క వచ్చినా దానికి భయపడి పారిపోతుంది. ఏనుగును బంధించిన తన బలం ఏమైంది? తన స్థానం జలం ఆ జలంలో ఉన్నంతవరకు మహారాణి తన స్థావరాన్ని వదిలి బయటకు వస్తే పరాయిది. కనుక  తన బలిమి కానీ, తన బలం కానీ పనిచేయదు అని సున్నితంగా మనకు హెచ్చరిక చేస్తున్నాడు యోగివేమన. ఆచరించి తీరవలసిన సూచన. మనం గమనిస్తే ఇది ఒక వేదసూక్తి.

కామెంట్‌లు