నా పలక;-సి.హేమలత--పుంగనూరు--9666779103
ఓం నమశివాయ మాయ సిద్ధం నమః అంటూ 
తొలి పలుకులు పలికిన నా పలక
ఓంకారాన్ని ఒంటి నా నింపి 
నాకు అమృతం అందించెను నా పలక

తప్పుల తడకగా పదిమార్లు రాసి
 చెరిపిన సహనంగా నాకు రాతను
 నేర్పిన తొలిగురువు నా పలక

బలంతో రుద్దిన ఉమ్మిని అద్దిన ఓర్పుగా 
అక్షరాలు దిద్దించెను నా పలక

పిచ్చి గీతలు గీసిన నా రాతను మార్చి
 నడతను నేర్పి చెలిమై చంకన చేరును నా పలక

ఎన్నో పుస్తకాలకు సమమే,పలు భాషలు నేర్పగల లోకహిత
ప్రకృతి వరప్రసాదితమే నా పలక

నల్లని మేనిచాయతో ,ఇంపైన రూపుతో
తెల్లని అక్షరాలు ను మల్లె సొబగుతో
నా మదిని నింపిన జ్ఞానరూపి నా పలక


కామెంట్‌లు