-సెల్యుట్ చేద్దాం ; -డా.భరద్వాజరావినూతల --9866203795
కాలాలు మారవచ్చు 
కలలను మార్చుకోవచ్చు 
నీపై నా మనసులో  ఉన్నస్థానమిప్పటికీ ఎప్పటికి మారదు -
ఎందుకంటే -యెప్పటికి పదిలం 
ఎందుకంటె 
మేమెవరమో 
నీకుతెలియదు 
నీవెవరోమాకు
తెలియదూ
మా కోసం 
ఎండనకా,వాననకా మంచులో -
చీకట్లొసరిహద్దుల్లో  కాపలాకాస్తున్న ఓ 
సైనికా నీకు మా సెల్యూట్ -
పరాయి వాడు వస్తాడన్న 
భయం లేకుండా 
-గుండె లపై చేయి 
వేసుకొని నీ నిద్రను
పణంగా పెట్టి -
నిద్రపోయే మాకు 
చాతనయింది ఒక్కటే 
-నీకుసెల్యూట్ చెయ్యటమే -
నీకుటుంబాన్నివదిలిపెట్టి
 నీసౌఖ్యాలను తాకట్టు పెట్టి -
భారతమాతసేవలోఅణుక్షణం తరిస్త్తున్న
నీకునీసేవకు -సెల్యూట్ తప్ప ఏమివ్వగలం -
మీలాంటివారిని కన్నజన్మధన్యం -
భ రతమాతనుబిడ్డలుండీ గొడ్రాలుగా 
మారకుండాచూసుకోవటంలో 
చేసుకున్నా వుఎంతో పుణ్యం 
అందుకే సెల్యూట్  తో చేస్తున్న అభివందనం 
------------------------------------------------

కామెంట్‌లు