సూరీడు
మండుతున్నాడు
మాడ్చుచున్నాడు
ముచ్చెమటలుపట్టిస్తున్నాడు
సూరీడు
కోపపడుతున్నాడు
మొండికేశాడు
మితిమీరుతున్నాడు
పుడమిపై నిప్పులుకురిపిస్తున్నాడు
నీటిని ఆవిరిచేస్తున్నాడు
గాలిని వేడిచేస్తున్నాడు
ప్రాణులను ఉక్కిరిబిక్కిరిచేస్తున్నాడు
ప్రార్ధించినా
శాంతించుటలేదు
బ్రతిమిలాడినా
కరుణించుటలేదు
కవితతో అందరిని
కదిలిస్తా
సూర్యుడిని
శాంతింపజేస్తా
సముద్రమా
చల్లనిగాలిని వీచు
శరీరాలకు హాయినికూర్చు
ఎండను పారదోలు
మేఘాల్లారా
సూర్యునికి అడ్డుపడండి
వానలు కురిపించండి
వాతావరణం చల్లబరచండి
వర్షమా
జల్లులు కురిపించు
చెరువులు నింపు
నదులను పారించు
చందమా
వెన్నెల వెదజల్లు
చల్లదనం వ్యాపించు
మనసుల తృప్తిపరచు
వృక్షరాజములారా
ఎండలను పీల్చండి
చల్లని నీడలనివ్వండి
ప్రాణులను పరిరక్షించండి
దైవమా
ఇబ్బందులు చూడు
ఇక్కట్లు తొలగించు
ఇలను చల్లబరచు
కవులారా
సూరీడుతో మాట్లాడండి
ఉపశమనం కలిగించండి
ప్రాణులను కాపాడండి
అందరూ అభ్యర్ధనవిన్నారు
సూర్యునితో సంప్రదించారు
వారంగడువును విధించారు
స్పందనలేకపోతే చర్యలుచేబడతామన్నారు
ఓవారమాగండి
ఓపికపట్టండి
ఉపశమనంపొందండి
తొలకరివానలకు ఎదురుచూడండి
తొలకరిజల్లులు వస్తాయి
తాపాన్ని తరిమేస్తాయి
స్వాగతం పలకండి
స్వాంతన పొందండి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి