అతిరథ.పురాణ బేతాళ కథ.;-డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై
 విక్రమార్కుడు చెట్టువద్దకుచేరి శవాన్ని ఆవహించి ఉన్నబేతాళుని బంధించి భుజంపైనచేర్చుకుని నడవసాగాడు.
అప్పుడు శవంలోని బేతాళుడు ' మహరాజా నీ పట్టుదలమెచ్చదగినదే నాకు అతిరధుడు గురించి తెలియజేయి. తెలిసి చెప్పకపోయావో మరణిస్తావు' అన్నాడు.
'బేతాళాపంచమవేదంగాచెప్పుకునేమహాభారతం ప్రకారం, అతిరథ  అనగా ఒక సారధి,, కర్ణుడు యొక్క పెంపుడు తండ్రి .
ప్రకారం అతిరథ మాత్రం ధృతరాష్ట్ర మహారాజు నకు ఒక సారధి.
అయితే మూడవ అభిప్రాయం ప్రకారం అతిరథ మాత్రము ధృతరాష్ట మహారాజు నకు సారధి, అంగదేశానికి రాజు,
పురు వంశంలో మతినార అనే రాజు ఉండేవాడు. అతని పిల్లలు, తంశు, మహాన్, అతిరథ, దృహ్యుగా ఉన్నారు. 
యుద్ధంలో పాల్గొనే యోధుల యొక్క సామర్థ్యాన్ని తెలిపే ప్రమాణాలైన రథి, అతిరథి, మహారథి, అతి మహారథి, మహామహారథి అనే వాటిలో ఇది ఒక ప్రమాణం.
రథి అనగా ఏక కాలంలో 5000 మందితో యుద్ధం చేయగలిగే యోధుడు. మహాభారతంలో సోమదత్తుడు, సుదక్షిణ, శకుని, శిశుపాల, ఉత్తర, కౌరవుల్లో 96మంది, శిఖండి, ఉత్తమౌజులు, ద్రౌపది కొడుకులు వంటి వారు రథులు.
రథికి 12 రెట్లు సామర్థ్యం కలిగే యోధుడిని అతి రథి అంటారు. అనగా ఏక సమయంలో 60000 మందితో యుద్ధం చేయగలిగే యోధుడు. మహాభారతం ప్రకారం కృతవర్మ, శల్య, కృపాచార్య, భూరిశ్రవ, ద్రుపద, యుయుత్సు, విరాట, అకంపన, సాత్యకి, దృష్టద్యుమ్న, కుంతిభోజ, ఘటోత్కచ, ప్రహస్త, అంగద, దుర్యోధన, జయద్రథ, దుశ్శాసన, వికర్ణ, విరాట, యుధిష్ఠిర, నకుల, సహదేవ, ప్రద్యుమ్నులు అతిరథులు 'అన్నాడు విక్రమార్కుడు.
అతనికి మౌనభగంకావడంతో, శవంతోసహా మాయమైన బేతాళుడు తిరిగి చెట్టువద్దకు చేరాడు.పట్టువదలనివిక్రమార్కుడు బేతాళునికై వెనుతిరిగాడు.


కామెంట్‌లు